ఐపీఎల్’టాటా’..! మరికాసేపట్లో బిడ్స్ తెరవనున్న బీసీసీఐ

ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ స్ఫాన్సర్‌ ఎవరో మరికాసేపట్లో తేలిపోనుంది. 2018 నుంచి టైటిల్ స్ఫాన్సర్‌గా ఉన్న చైనాకి చెందిన వివో కంపెనీని ఇటీవల తప్పించిన బీసీసీఐ.. కొత్తగా బిడ్స్‌ని ఆహ్వానించింది. దాంతో.. భారత్‌కి చెందిన ప్రముఖ కంపెనీలు పోటీ...

ఐపీఎల్'టాటా'..! మరికాసేపట్లో బిడ్స్ తెరవనున్న బీసీసీఐ
Follow us

|

Updated on: Aug 18, 2020 | 11:59 AM

ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ స్ఫాన్సర్‌ ఎవరో మరికాసేపట్లో తేలిపోనుంది. 2018 నుంచి టైటిల్ స్ఫాన్సర్‌గా ఉన్న చైనాకి చెందిన వివో కంపెనీని ఇటీవల తప్పించిన బీసీసీఐ.. కొత్తగా బిడ్స్‌ని ఆహ్వానించింది. దాంతో.. భారత్‌కి చెందిన ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇందులో టాటా సన్స్‌తో పాటు రిలయన్స్ జియో, బైజూస్, అన్‌అకాడమీ తదితర కంపెనీలు బిడ్‌ దాఖలు చేశాయి. మరికాసేపట్లో.. బిడ్‌లను బీసీసీఐ తెరవనుంది. స్ఫాన్సర్‌షిప్ దక్కించుకున్న కంపెనీ పేరుని అధికారికంగా ప్రకటించనుంది.

ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌గా వివో ఏటా రూ.440 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తూ వచ్చింది. మరి కొత్త స్ఫాన్సర్‌ అంత పెద్ద మొత్తంలో బిడ్ చెల్లిస్తారా.. లేదా.. అనేది పెద్ద ప్రశ్న…  కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. దాంతో.. కొత్త స్ఫాన్సర్‌ రూ.300-400 కోట్లు చెల్లించినా స్ఫాన్సర్‌షిప్‌ని ఇచ్చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇది కూడా కేవలం నాలుగు నెలల పాటు మాత్రమే ఉంటుంది. అందుకే బిడ్ దాఖలు చేసే కంపెనీ టర్నోవర్ కనీసం రూ.300 కోట్లు ఉండాలని బీసీసీఐ ఓ నిబంధనని కూడా చేర్చింది.

యూఏఈ వేదికగా 53 రోజుల పాటు మొత్తం 60 మ్యాచ్‌లు జరగనుండగా.. ఇందులో 10 డబుల్ హెడర్ మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. దానికితోడు టోర్నీ సమయంలోనే దసరా, దీపావళి పండగలు కూడా వస్తుండటంతో.. ఐపీఎల్ టోర్నీకి వ్యూవర్‌షిప్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి పోటీ పడుతున్న కంపెనీలు.

కాబట్టి.. స్ఫాన్సర్‌షిప్‌ కోసం రూ.440 కోట్లు పైచిలుకు బిడ్ వేసిన కంపెనీలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ.. బీసీసీఐ మాత్రం కంపెనీ విలువలకి అధిక ప్రాధాన్యమివ్వబోతోంది. ఈ క్రమంలో ఎక్కువ ధరకి బిడ్ వేసిన కంపెనీ కంటే.. మంచి విలువతో కూడిన కంపెనీ తక్కువ ధరకి బిడ్ వేసినా.. స్ఫాన్సర్‌షిప్ దక్కే అవకాశాలు లేకపోలేదు. ఈ స్ఫాన్సర్‌షిప్ రేసులో ప్రస్తుతం టాటా సన్స్  మొదటి స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఏడాది అధిక ప్రాధన్యం స్వదేశీ కంపెనీలే కావడంతో కొంత పోటీ తక్కువగా ఉండే అవకాశం ఉంది.