AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెంటిలేటర్ సపోర్ట్ పైనే ప్రణబ్ చికిత్స

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్య పరిస్థితి‌పై ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ బులెటిన్ విడుదల చేసింది. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని.. ఆయన ఇంకా కోమాలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

వెంటిలేటర్ సపోర్ట్ పైనే ప్రణబ్ చికిత్స
Balaraju Goud
|

Updated on: Aug 18, 2020 | 11:59 AM

Share

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్య పరిస్థితి‌పై ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ బులెటిన్ విడుదల చేసింది. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని.. ఆయన ఇంకా కోమాలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వెంటిలేటర్ సపోర్ట్ పైనే ప్రణబ్ చికిత్స పొందుతున్నారని అధికారులు పేర్కొన్నారు. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్య నిపుణులు తెలిపారు. ప్రణబ్ సోమవారం నుంచి కోమాలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నాయి. ప్రణబ్ కు అత్యవసర సేవలు కొనసాగిస్తున్నట్లు అస్పత్రి వర్గాలు వివరించాయి. కాగా, ప్రణబ్‌ ఆరోగ్యంలో స్వల్పంగా మెరుగుదల కనిపించిందని కుటుంబ సభ్యులు సోమవారం మీడియాతో చెప్పారు.

Follow Us