AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో 6.50 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. నిత్యం కొత్తకేసులు నమోదవుతూనే ఉన్నాయి. కాగా, కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండడంతో కాస్త ఉపశమనం కలిగిస్తోంది.

తమిళనాడులో 6.50 లక్షలు దాటిన కరోనా కేసులు
Balaraju Goud
|

Updated on: Oct 10, 2020 | 7:15 PM

Share

దేశంలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. నిత్యం కొత్తకేసులు నమోదవుతూనే ఉన్నాయి. కాగా, కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండడంతో కాస్త ఉపశమనం కలిగిస్తోంది. తాజాగా త‌మిళ‌నాడులో క‌రోనా యాక్టివ్ కేసులు స్థిరంగా కొన‌సాగుతున్నాయి. ప్ర‌తిరోజు కొత్త‌గా న‌మోద‌య్యే పాజిటివ్ కేసులు, రిక‌వ‌రీలు ఇంచుమించు స‌మానంగా ఉంటుండ‌టంతో యాక్టివ్ కేసుల సంఖ్య‌లో పెద్ద‌గా మార్పు ఉండటంలేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో శుక్ర‌వారం సాయంత్రం నుంచి శ‌నివారం సాయంత్రం వ‌ర‌కు కొత్త‌గా 5,242 మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది. కాగా, ఒక్కరోజులోనే 5,222 మంది కొవిడ్ వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,51,370కి చేరింది. అందులో ఇప్ప‌టివ‌ర‌కు 5,97,033 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తమిళనాట మ‌రో 44,150 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, శ‌నివారం కొత్త‌గా 67 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో త‌మిళ‌నాడులో మొత్తం క‌రోనాను జయించలేక 10,187 మంది మరణించినట్లు త‌మిళ‌నాడు ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది.

Follow Us
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?