కరోనా నుంచి కోలుకుంటున్నాః తమన్నా
కరోనా బారినపడ్డ సినీ నటి తమన్నా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు.
కరోనా బారినపడ్డ సినీ నటి తమన్నా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్ అవుతున్నట్లు తెలిపింది. తమన్నా కొవిడ్-19తో బాధపడుతున్నట్లు ఆదివారం తెలిసింది. ఈ నేపథ్యంలో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. దీంతో సోమవారం సాయంత్రం తమన్నా ఓ ప్రకటన విడుదల చేశారు.
సెట్‌లో తమ బృందం జాగ్రత్తలు పాటిస్తూ, నిబద్ధతతోనే ఉన్నామని తమన్నా తెలిపారు. అయినప్పటికీ గత వారం తనకు స్వల్పంగా జ్వరం వచ్చిందని, దీంతో పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. దీంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి, వైద్యుల సలహాతో చికిత్స తీసుకున్నానని తెలిపారు. ఇప్పుడు తనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు తమన్నా ట్వీట్టర్ లో షేర్ చేశారు. ప్రపంచంలోని చాలా మందిని కరోనా ఇబ్బంది పెడుతుండగా.. తను పూర్తిగా కోలుకోవడం అదృష్టమేనన్నారు. తను కోలుకోవాలని ప్రార్థించిన వారికి, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
— Tamannaah Bhatia (@tamannaahspeaks) October 5, 2020