ఉద్రిక్తతల నివారణకు చర్చలే మార్గం, చైనాకు మళ్ళీ స్పష్టం చేసిన భారత్
బోర్డర్లో శాంతియుత పరిస్థితి పునరుధ్దరణకు చర్చలే మార్గమని భారత్ మళ్ళీ చైనాకు స్పష్టం చేసింది. మొదట మీ సేనలు పూర్తిగా వెనక్కి మళ్ళాలి.. ఇందుకు మనఃస్ఫూర్తిగా అరమరికలు లేని చర్చలు..

బోర్డర్లో శాంతియుత పరిస్థితి పునరుధ్దరణకు చర్చలే మార్గమని భారత్ మళ్ళీ చైనాకు స్పష్టం చేసింది. మొదట మీ సేనలు పూర్తిగా వెనక్కి మళ్ళాలి.. ఇందుకు మనఃస్ఫూర్తిగా అరమరికలు లేని చర్చలు జరగాలి అని సూచించింది. లడాఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు ప్రాంతంలో చైనా మిలిటరీ చొరబాట్ల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రస్తావిస్తూ, అక్కడ యథాతథ పరిస్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా యత్నిస్తోందని ఆరోపించింది. పరిస్థితిని చక్కదిద్దెందుకు గ్రౌండ్ కమాండర్లు ఇంకా చర్చలు జరుపుతున్నారని ఈ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. చైనా దళాలు మళ్ళీ మళ్ళీ ముందుకు చొచ్ఛుకురావడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సైనిక, దౌత్య స్థాయుల్లో ఇన్ని దఫాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా తన వైఖరిని మార్చుకోవడంలేదని ఆయన దుయ్యబట్టారు.