AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెరుచుకున్న ప్రేమసౌధం.. ‘తాజ్‌మహల్’

దేశ, విదేశీ పర్యాటకులు, ప్రేమ జంటలకు ఓ శుభవార్త. ప్రేమకు ప్రతిరూపంగా భావించే తాజ్‌మహల్ దర్శనానికి అనుమతినిచ్చింది ప్రభుత్వం. ఆగ్రాలోని అంతర్జాతీయ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం తాజ్‌మహల్ ఆరు నెలల తర్వాత ఇవాళ తెరుచుకుంది.

తెరుచుకున్న ప్రేమసౌధం.. ‘తాజ్‌మహల్’
Balaraju Goud
|

Updated on: Sep 21, 2020 | 6:00 PM

Share

దేశ, విదేశీ పర్యాటకులు, ప్రేమ జంటలకు ఓ శుభవార్త. ప్రేమకు ప్రతిరూపంగా భావించే తాజ్‌మహల్ దర్శనానికి అనుమతినిచ్చింది ప్రభుత్వం. ఆగ్రాలోని అంతర్జాతీయ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం తాజ్‌మహల్ ఆరు నెలల తర్వాత ఇవాళ తెరుచుకుంది. సోమవారం నుంచి తాజ్ మహల్ సందర్శనకు పర్యాటకులను అనుమతించినట్లు ఏఎస్ఐ అధికారులు తెలిపారు. దేశంలో కరోనా విజృంభణ కారణంగా లాక్‌డౌన్‌కు ముందే మార్చి 17న తాజ్‌మహల్ సందర్శకులను నిలిపివేశారు. తాజ్‌మహల్ చరిత్రలో ఇన్ని రోజులు మూసివేయడం ఇదే తొలిసారి. ఇక, అన్ లాక్ ప్రక్రియలో భాగంగా తాజ్‌మహల్ ను తిరిగి తెరిచేందుకు అనమతినిచ్చారు. పక్కాగా, కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. తాజ్‌మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ వంటి ఏర్పాట్లు చేశారు. ఒక రోజులో గరిష్ఠంగా 5,000 మంది పర్యాటకులను మాత్రమే తాజ్ సందర్శనకు అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, తాజ్‌మహల్ సందర్శనకు పర్యాటకులను అనుమతిస్తున్నప్పటికీ… గ్రూప్ ఫోటోలు తీసుకునేందుకు మాత్రం అనుమతించడంలేదు. సందర్శకులు ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. లైసెన్స్ పొందిన టూర్ గైడ్స్ ని మాత్రమే లోనికి అనుమతించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, తాజ్‌మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులు ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. స్వదేశీ పర్యాటకులు రూ.50 ఎంట్రీ ఫీజును చెల్లించాల్సి ఉండగా… విదేశీ పర్యాటకుల టికెట్ ధరను రూ.1100గా నిర్ణయించారు. కొవిడ్ నిబంధనలు పాటించనివారికి జరిమానాలు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు.

Follow Us
ఆసియా గేమ్స్ షెడ్యూల్ ఇదే.. టీమిండియాతో తలపడే జట్లు ఇవే..?
ఆసియా గేమ్స్ షెడ్యూల్ ఇదే.. టీమిండియాతో తలపడే జట్లు ఇవే..?
అప్పుడే ఓటీటీలోకి యశ్ 'టాక్సిక్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
అప్పుడే ఓటీటీలోకి యశ్ 'టాక్సిక్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మంగళకరమైన రోజు మంగళవారం మీ రాశి ఎలా ఉందంటే..?
మంగళకరమైన రోజు మంగళవారం మీ రాశి ఎలా ఉందంటే..?
టెన్త్ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 18 వరకే ఛాన్స్‌!
టెన్త్ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 18 వరకే ఛాన్స్‌!
హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ
హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది