దుబ్బాక ఉపఎన్నిక ఫలితంపై వీహెచ్ హాట్ కామెంట్
త్వరలో జరుగనున్న దుబ్బాక ఉపఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ సినియర్ నేత వీహెచ్ హనుమంతరావు హాట్ కామెంట్ చేశారు. తమ పార్టీ అభ్యర్థి అయిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలను కలుపుకొని పోవాలి.. లేకపోతే ఇబ్బంది తప్పదు అన్నారు. ఉప ఎన్నికలు ముగిసే దాకా రాష్ర్టా స్థాయి నేతలు దుబ్బాకలోనే ఉండాలి అని మనిక్ ఠాకూర్ చెప్పారని వీహెచ్ గుర్తు చేశారు. కానీ కొంతమంది నేతలు మాత్రం దుబ్బాకలో ఉండడం లేదని అన్నారు. వారికి వేరే వేరే పనులు […]
త్వరలో జరుగనున్న దుబ్బాక ఉపఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ సినియర్ నేత వీహెచ్ హనుమంతరావు హాట్ కామెంట్ చేశారు. తమ పార్టీ అభ్యర్థి అయిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలను కలుపుకొని పోవాలి.. లేకపోతే ఇబ్బంది తప్పదు అన్నారు. ఉప ఎన్నికలు ముగిసే దాకా రాష్ర్టా స్థాయి నేతలు దుబ్బాకలోనే ఉండాలి అని మనిక్ ఠాకూర్ చెప్పారని వీహెచ్ గుర్తు చేశారు. కానీ కొంతమంది నేతలు మాత్రం దుబ్బాకలో ఉండడం లేదని అన్నారు. వారికి వేరే వేరే పనులు ఉన్నాయో ఏమో.. అందుకే ఉండడం లేదు ఏమో.. అని వీహెచ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. “దుబ్బాక ఉపఎన్నికలో ఎంత మెజారిటీ వస్తది అనేది ముఖ్యం కాదు.. అక్కడ మా పార్టీ గెలవడమే మాకు ముఖ్యం” అని వీహెచ్ అన్నారు.