రానా, మిహీకాల పెళ్లి ఎప్పుడో చెప్పేసిన సురేష్ బాబు

ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోలంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరోలు నితిన్, నిఖిల్‌ ఈ వరుసలో ఉండగా.. ఇప్పుడు ఆ వరుసలోకి రానా దగ్గుబాటి కూడా చేరిపోయాడు. మంగళవారం ఎవరూ ఊహించని విధంగా సోషల్ మీడియా వేదికగా..

రానా, మిహీకాల పెళ్లి ఎప్పుడో చెప్పేసిన సురేష్ బాబు
Follow us

| Edited By:

Updated on: May 13, 2020 | 3:47 PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోలంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరోలు నితిన్, నిఖిల్‌ ఈ వరుసలో ఉండగా.. ఇప్పుడు ఆ వరుసలోకి రానా దగ్గుబాటి కూడా చేరిపోయాడు. మంగళవారం ఎవరూ ఊహించని విధంగా సోషల్ మీడియా వేదికగా.. ‘తన ప్రియురాలు ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. తన ప్రపోజల్‌కి ఆమె అంగీకరించినట్టు’.. ట్వీట్ చేశాడు రానా. ఈ పోస్ట్‌తో అటు సెలబ్రిటీలకు, ఇటు అభిమానులు షాక్‌కి గురయ్యారు. కాగా రానా ప్రేయసి పేరు మిహీకా బజాజ్. తను డ్యూ డ్రాప్ అనే డిజైన్ స్టూడియోను రన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరికీ పరిచయం లేని ఈ అమ్మాయితో ఇప్పుడు రానా.. తన జీవిత భాగస్వామి అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వీరి పెళ్లి గురించి ప్రధానంగా చర్చ సాగుతోంది. కాగా ఈ సమయంలో రానా తండ్రి సురేష్ బాబు వీరి పెళ్లి ఎప్పుడనే సస్పెన్స్‌ను కూడా తొలగించారు.

తాజాగా ఓ నేషనల్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన సురేష్ బాబు.. వీరి వివాహంపై కూడా స్పందించారు. రానా, మిహీకాల పెళ్లి డిసెంబర్‌లో చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వీరిద్దరూ చాలా కాలం నుంచి ఒకరికొకరు తెలుసని, వారిద్దరూ జీవితంలో ఒకటి కావాలనుకోవడం సంతోషమన్నారు సురేష్ బాబు. వీరి పెళ్లి డిసెంబర్ లేదా అంతకంటే ముందే జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మే అంతా బిజీగా ఉన్నాం. అందులోనూ ఇప్పుడు కరోనా వైరస్‌ ఒకటి ఉంది.. కాబట్టి వీరి పెళ్లికి కొంత సమయం ఉన్నట్లు ఆయన చెప్పారు. అలాగే వీరిద్దరి పెళ్లికి సంబంధించిన అన్ని వివరాలూ త్వరలోనే వెల్లడిస్తామన్నారు ప్రొడ్యూసర్ సురేష్ బాబు.

Read More:

బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్‌ఆర్టీసీ‌లో కొత్త మోడల్

రెండో భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పిక్

అమెరికాలో కలకలం.. పిల్లల్లో కొత్తరకమైన కోవిడ్.. 100 మంది పిల్లలు!

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ