అమెరికాలో కలకలం.. పిల్లల్లో కొత్తరకమైన కోవిడ్.. 100 మంది పిల్లలు!

పిల్లల్లో కొత్తరకమైన కోవిడ్ వైరస్ రావడంతో.. అమెరికాలో ఒక్కసారిగా కలకలం రేగింది. పిడియాట్రిక్ మల్టీ-సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్.. అనే కొత్త రకమైన రోగంతో పెద్ద ఎత్తున కొత్త కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ పిల్లల్లోనే..

అమెరికాలో కలకలం.. పిల్లల్లో కొత్తరకమైన కోవిడ్.. 100 మంది పిల్లలు!
Follow us

| Edited By:

Updated on: May 13, 2020 | 11:54 AM

పిల్లల్లో కొత్తరకమైన కోవిడ్ వైరస్ రావడంతో.. అమెరికాలో ఒక్కసారిగా కలకలం రేగింది. పిడియాట్రిక్ మల్టీ-సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్.. అనే కొత్త రకమైన రోగంతో పెద్ద ఎత్తున కొత్త కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ పిల్లల్లోనే కనిపించడం విశేషం. దీన్నే కవాసాకీ వ్యాధి లేదా టాక్సి షాక్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తూంటారని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. ఈ రకమైన వ్యాధి ఈ మధ్య న్యూయార్క్‌లోకి పిల్లలకు తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ రకమైన కరోనా సోకి.. పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే దాదాపు 100 మంది పిల్లలకు ఈ వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే ఐదు మంది ఈ వ్యాధితో మృతి చెందారు. బుధవారం తొలిసారిగా ఐదేళ్ల పిల్లాడు న్యూయార్క్‌లో చనిపోయాడు. కాగా కొంత మంది పిల్లల్లో ఈ రకమైన కరోనా సోకిన 6 వారాల తర్వాత వ్యాపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని న్యూయార్క్ మేయర్ ప్రజలను కోరారు.

పిల్లల్లో కనిపించే కొత్త సిండ్రోమ్ లక్షణాలు:

– ముందుగా జ్వరం వస్తుంది – నీరసం రావడం – ఆకలి వేయకపోవడం – దురదలు రావడం – పెదవులు మరింత ఎర్రగా మారిపోవడం – నోరు కూడా ఎర్రగా మారడం – కొంత మంది పిల్లలు స్కిన్ కలర్ మారడం – పొట్టలో నొప్పి రావడం – వికారంగా ఉండి వాంతులు రావడం

ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లల్ని ఎంత త్వరగా ఆస్పత్రికి తీసుకొస్తే.. అంత మంచిదంటున్నారు డాక్టర్లు. ఇలాంటి పరిస్థితి వారం కిందటి వరకూ లేదనీ.. ఇప్పుడు అమెరికా మొత్తం ఈ కొత్త కేసులు నమోదవుతాయని అంటున్నారు వైద్యులు.

Read More:

బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్‌ఆర్టీసీ‌లో కొత్త మోడల్

రెండో భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పిక్

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. టెన్త్ విద్యార్థులకు వాట్సాప్‌ లెసన్స్