కన్నడ నటి రాగిణి ద్వివేదీ బెయిల్ కేసులో విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 21 కి వాయిదా వేసింది. డ్రగ్స్ కేసులో తనకు కర్ణాటక హైకోర్టు బెయిలును నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఈమె సుప్రీంకోర్టులో నవంబరు 3 న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా…..న్యాయమూర్తులు ఆర్ ఎఫ్ నారిమన్, నవీన్ సిన్హా, ఇందు మల్హోత్రాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ ను గతవారం పరిశీలించి విచారణను ఈ మంగళవారానికి వాయిదా వేసింది. డ్రగ్స్ వినియోగంతో బాటు వాటిని సరఫరా చేసినట్టు రాగిణి పై ఆరోపణలు వఛ్చిన నేపథ్యంలో బెంగుళూరు సీసీబీ పోలీసులు గత ఏడాది సెప్టెంబరు 4 న అరెస్టు చేశారు. ఈ కేసులో తనను నిందితురాలిగా పేర్కొన్నారని, 90 రోజులపాటుజైల్లో ఉన్నా తన నుంచి ఎలాంటి మాదకద్రవ్యాలనూ పోలీసులు గానీ ఎన్సీబీ అధికారులు గానీ స్వాధీనం చేసుకోలేకపోయారని రాగిణి ద్వివేదీ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతానికి ఈమెకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించలేదు.