మరో కొత్త వివాదంలో ‘దర్బార్’.. శశికళే టార్గెట్‌గా డైలాగ్స్!

సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘దర్బార్‌’ మూవీ.. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో వివాదంలో నిలిచింది దర్బార్ సినిమా. ఈ చిత్రంలో మాజీ అన్నాడీఎంకే నేత శశికళని కించపరుస్తూ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ సినిమాలోని డైలాగ్స్‌ని వెంటనే తొలగించాలని శశికళ తరపు న్యాయవాది డిమాండ్ చేస్తున్నారు. పరప్పన అగ్రహారం జైల్లో ఉన్న శశికళపై వచ్చిన ఆరోపణలను విమర్శించింది దర్బార్ చిత్ర యూనిట్. అవి కేవలం […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:13 pm, Fri, 10 January 20
మరో కొత్త వివాదంలో 'దర్బార్'.. శశికళే టార్గెట్‌గా డైలాగ్స్!

సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘దర్బార్‌’ మూవీ.. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో వివాదంలో నిలిచింది దర్బార్ సినిమా. ఈ చిత్రంలో మాజీ అన్నాడీఎంకే నేత శశికళని కించపరుస్తూ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ సినిమాలోని డైలాగ్స్‌ని వెంటనే తొలగించాలని శశికళ తరపు న్యాయవాది డిమాండ్ చేస్తున్నారు. పరప్పన అగ్రహారం జైల్లో ఉన్న శశికళపై వచ్చిన ఆరోపణలను విమర్శించింది దర్బార్ చిత్ర యూనిట్. అవి కేవలం సన్నివేశం కోసం మాత్రమే ఉన్నాయని.. వాటిలో మరే ఉద్ధేశం లేవని చిత్ర యూనిట్ అంటోంది. అలాగే దర్బార్ సినిమాకి మద్దతు పలుకుతున్నారు రాష్ట్ర మంత్రులు.

‘సినిమాలోని ఓ జైలు సన్నివేశంలో, ముంబై పోలీసు కమిషనర్ హోదాలో రజనీ వెళ్తుంటే.. ఓ ఖైదీ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. ఆపై డబ్బులుంటే ఖైదీలు షాపింగ్‌కి కూడా వెళ్లవచ్చు’ అనే డైలాగ్ ఉంటుంది. ఈ మధ్య శశికళ జైలు నుంచి బయటకెళ్లి షాపింగ్ చేశారనే వార్తలు తమిళనాట అంతటా ఫుల్లుగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. ఈ డైలాగ్స్ శశికళను ఉద్ధేశించి అన్నారని శశికళ వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. శశికళ తరపు న్యాయవాది కూడా ఈ డైలాగ్స్‌ని వెంటనే సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.