‘సరిలేరు’లో అనిల్ సర్‌ప్రైజ్.. ఏంటో తెలుసా..!

సూపర్‌‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమా ఎండింగ్ టైటిల్స్ వచ్చే సమయంలో దర్శకుడి అనిల్ రావిపూడి డ్యాన్స్ ఉండనుందట. మగధీర సినిమా ఎండింగ్‌ టైటిల్స్ వచ్చేటప్పుడు అనగనగా అనే పాటకు టీమ్ మొత్తం డ్యాన్స్ వేసే సమయం తెలిసిందే. […]

'సరిలేరు'లో అనిల్ సర్‌ప్రైజ్.. ఏంటో తెలుసా..!
Follow us

| Edited By:

Updated on: Jan 11, 2020 | 6:58 AM

సూపర్‌‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమా ఎండింగ్ టైటిల్స్ వచ్చే సమయంలో దర్శకుడి అనిల్ రావిపూడి డ్యాన్స్ ఉండనుందట. మగధీర సినిమా ఎండింగ్‌ టైటిల్స్ వచ్చేటప్పుడు అనగనగా అనే పాటకు టీమ్ మొత్తం డ్యాన్స్ వేసే సమయం తెలిసిందే. ఇక ఇప్పుడు సరిలేరు నీకెవ్వరులో కూడా అనిల్ అలా డ్యాన్స్ చేయబోతున్నాడట. అయితే ఈ పాటలో టీమ్ మొత్తం ఉంటుందా..? లేక సోలోగా అనిల్ డ్యాన్స్ చేయబోతున్నారా..? అనే ప్రశ్నలకు సమాధానం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడిన దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరులో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని చెప్పారు. అలాగే సూపర్‌స్టార్ కృష్ణ కూడా ఈ మూవీలో కనిపించబోతున్నట్లు ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా సరిలేరు నీకెవ్వరుపై మహేష్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని టీమ్ మొత్తంతో పాటు ఫ్యాన్స్ అంచనాలు పెంచుకున్నారు.