AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదివారం ప్రత్యేక రైళ్లు

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షరేపు (ఆదివారం) జరుగనున్న నేప‌థ్యంలో అభ్య‌ర్థుల సౌక‌ర్యార్థం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఢిల్లీ మెట్రో రైలు స‌ర్వీసులు ఉద‌యం 6 గంట‌ల‌కే ప్రారంభం కానున్నాయి. టెర్మిన‌ల్ స్టేష‌న్స్‌లోని అన్ని మార్గాల నుండి మెట్రో రైలు సర్వీసులు ఉద‌యం 6 గంట‌ల‌కే ప్రారంభం కానున్న‌ట్లు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేష‌న్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేసింది. సివిల్స్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల‌కు డీఎంఆర్‌సీతో పాటు […]

ఆదివారం ప్రత్యేక రైళ్లు
Venkata Narayana
| Edited By: |

Updated on: Oct 03, 2020 | 9:26 PM

Share

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షరేపు (ఆదివారం) జరుగనున్న నేప‌థ్యంలో అభ్య‌ర్థుల సౌక‌ర్యార్థం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఢిల్లీ మెట్రో రైలు స‌ర్వీసులు ఉద‌యం 6 గంట‌ల‌కే ప్రారంభం కానున్నాయి. టెర్మిన‌ల్ స్టేష‌న్స్‌లోని అన్ని మార్గాల నుండి మెట్రో రైలు సర్వీసులు ఉద‌యం 6 గంట‌ల‌కే ప్రారంభం కానున్న‌ట్లు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేష‌న్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేసింది. సివిల్స్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల‌కు డీఎంఆర్‌సీతో పాటు సౌత్ వెస్ట్రన్ రైల్వే త‌న సేవ‌ల‌ను అందిస్తుంది. వాయువ్య కర్ణాటకలోని హుబ్లీ నుండి బెంగళూరు వరకు ప్రత్యేక రైలును నడుపుతుంది. అదేవిధంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సైతం రెండు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌డ‌ప నుండి అనంత‌పురం, క‌ర్నూలు నుంచి అనంత‌పురం వ‌ర‌కు రైళ్ల‌ను న‌డుపుతారు. అయితే, అభ్యర్థులు కచ్చితంగా కొవిడ్ జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు జరపాలని రైల్వే శాఖ కోరింది.

అఖిల భారత సర్వీసుల నియామకాల కోసం నిర్వ‌హించే సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వాయిదా వేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30న తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దీంతో యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్‌సీ) రేపు (అక్టోబ‌ర్ 4)వ తేదీనే సివిల్ స‌ర్వీసెస్ ఎగ్జామ్‌ను నిర్వ‌హించ‌నుంది. కోవిడ్‌-19 మ‌హమ్మారి.. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో సంభ‌వించిన‌ వరదలను దృష్టిలో ఉంచుకుని 20 మంది సివిల్ సర్వీస్ అభ్య‌ర్థుల‌ బృందం పరీక్ష వాయిదా కోరుతూ దాఖలు చేసిన అభ్యర్థనను సుప్రీం తిరస్కరిస్తూ పరీక్ష నిర్వహణకు మార్గం సుగమం చేసిన సంగతి తెలిసిందే.

Follow Us
కళ్లద్దాలతో యూపీఐ పేమెంట్స్.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇలా..
కళ్లద్దాలతో యూపీఐ పేమెంట్స్.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇలా..
షుగర్ ఉన్నవారికి దాల్చినచెక్క మంచిదేనా? డాక్టర్ దీక్షా చెప్పిన
షుగర్ ఉన్నవారికి దాల్చినచెక్క మంచిదేనా? డాక్టర్ దీక్షా చెప్పిన
శని అమావాస్య నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!
శని అమావాస్య నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!
ఒక్క రాత్రిలోనే రూ. 54 కోట్ల చోరీ.. 600 ఏళ్ల నాటి చరిత్రలోనే అతి
ఒక్క రాత్రిలోనే రూ. 54 కోట్ల చోరీ.. 600 ఏళ్ల నాటి చరిత్రలోనే అతి
టీ20 చరిత్రలో రెండోసారి అరుదైన రికార్డు
టీ20 చరిత్రలో రెండోసారి అరుదైన రికార్డు
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అందుబాటులోకి అప్పుడే..!
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అందుబాటులోకి అప్పుడే..!
లైక్‌లు, కామెంట్ల పిచ్చి.. మీ మానసిక ఆరోగ్యాన్ని మీరే..
లైక్‌లు, కామెంట్ల పిచ్చి.. మీ మానసిక ఆరోగ్యాన్ని మీరే..
ఢిల్లీ ఫ్యాన్స్‌కు షాక్.. భారత్-శ్రీలంక మ్యాచ్ వేదిక మార్పు
ఢిల్లీ ఫ్యాన్స్‌కు షాక్.. భారత్-శ్రీలంక మ్యాచ్ వేదిక మార్పు
ట్రైన్ రద్దయితే రీఫండ్ మొత్తం వస్తుందా..? రైల్వేశాఖ రూల్స్..
ట్రైన్ రద్దయితే రీఫండ్ మొత్తం వస్తుందా..? రైల్వేశాఖ రూల్స్..
ప్రాణంగా ప్రేమిస్తే.. మరొకరితో సన్నిహితంగా ప్రియురాలు.. చివరకు
ప్రాణంగా ప్రేమిస్తే.. మరొకరితో సన్నిహితంగా ప్రియురాలు.. చివరకు