గుడ్ న్యూస్.. అత్యంత చవక ధరకే కరోనా మందు..

ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మాసిటికల్స్ ఇండస్ట్రీస్ ఫ్లూగార్డ్ పేరిట 'ఫావిపిరవిర్‌-200 ఎంజీ' ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యంత చవక ధరకే అందరికీ అందుబాటులో ఉండే విధంగా..

గుడ్ న్యూస్.. అత్యంత చవక ధరకే కరోనా మందు..

COVID-19 Drug Favipiravir At Rs 35 Per Tablet: యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి పరిశోధకులు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు కొన్ని యాంటీ వైరల్ డ్రగ్స్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటే ‘ఫావిపిరవిర్‌’. ఈ మందును స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కోవిడ్ పేషెంట్ల చికిత్సకు ఉపయోగించేందుకు భారత ప్రభుత్వం ఇదివరకే అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మాసిటికల్స్ ఇండస్ట్రీస్ ఫ్లూగార్డ్ పేరిట ‘ఫావిపిరవిర్‌-200 ఎంజీ’ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మందులో ఒక్కో టాబ్లెట్ ధర కేవలం రూ. 35 మాత్రమే.

ఈ సందర్భంగా సన్ ఫార్మా సీఈఓ కీర్తి గానోర్కర్ మాట్లాడుతూ.. ”దేశంలో ప్రతీరోజూ 50 వేలకుపైగా కేసులు నమోదవుతున్న తరుణంలో వైద్య సిబ్బింది చికిత్స అందించేందుకు మరిన్ని ఔషధాలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే చవక ధరలో ఎక్కువమంది బాధితులకు అందుబాటులో ఉండే విధంగా ఫ్లూగార్డ్ పేరిట ‘ఫావిపిరవిర్‌-200 ఎంజీ’ని ఆవిష్కరించాం. దేశవ్యాప్తంగా ఉన్న కరోనా రోగులకు ఫ్లూగార్డ్ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం, వైద్య నిపుణులతో కలిసి పని చేస్తాం. ఈ వారంలోనే ఫ్లూగార్డ్ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుంది” అని ఆమె పేర్కొన్నారు.

Also Read:

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..

Published On - 6:53 am, Wed, 5 August 20

Click on your DTH Provider to Add TV9 Telugu