బ్రేకింగ్: అట్టుడుకుతోన్న ఢిల్లీ.. రాష్ట్రపతి భవన్ వద్ద రచ్చ

సెంట్రల్‌ ఢిల్లీలో 144 సెక్షన్‌ని విధించారు పోలీసులు. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ వద్ద రచ్చ రచ్చ జరుగుతోంది. జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళనతో సెంట్రల్ ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. రాష్ట్రపతి భవన్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, పార్లమెంట్ వద్ద పోలీసుల అదనపు బలగాలు మోహరించాయి. శాస్త్రి భవన్ హెచ్‌ఆర్డీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న జేఎన్‌యూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. జనవరి 5న జేఎన్‌యూలో విద్యార్థులపై దాడికి వీసీ జగదీశ్ కుమార్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:18 pm, Thu, 9 January 20
బ్రేకింగ్: అట్టుడుకుతోన్న ఢిల్లీ.. రాష్ట్రపతి భవన్ వద్ద రచ్చ

సెంట్రల్‌ ఢిల్లీలో 144 సెక్షన్‌ని విధించారు పోలీసులు. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ వద్ద రచ్చ రచ్చ జరుగుతోంది. జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళనతో సెంట్రల్ ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. రాష్ట్రపతి భవన్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, పార్లమెంట్ వద్ద పోలీసుల అదనపు బలగాలు మోహరించాయి. శాస్త్రి భవన్ హెచ్‌ఆర్డీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న జేఎన్‌యూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. జనవరి 5న జేఎన్‌యూలో విద్యార్థులపై దాడికి వీసీ జగదీశ్ కుమార్ కారణమని ఆయన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.