కస్టమర్లకు ఎస్‌బీఐ అల‌ర్ట్…అలా చేస్తే డ‌బుల్ ఫైన్..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు వార్నింగ్ ఇచ్చింది. బ్యాంక్ ఫాస్టాగ్స్ ఉపయోగిస్తున్న వారిని ప‌లు సూచ‌న‌లు చేసింది. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తాజా రూల్స్ పాటించాల‌ని కస్టమర్లను కోరింది. లేదంటే భారీ ఫైన్స్ త‌ప్ప‌వ‌ని హెచ్చరించింది. ఈ మేరకు ఎస్‌బీఐ ఒక ట్వీట్ చేసింది. ఎస్‌బీఐ ఫాస్టాగ్స్ ఉపయోగిస్తున్న వాహనదారులు అందరూ గ‌వ‌ర్న‌మెంట్ రూల్స్ పాటించాల‌ని ఎస్‌బీఐ కోరింది. ఫాస్టాగ్ లేని వెహిక‌ల్ లేదా ఫాస్టాగ్ ఉప‌యోగించ‌ని వాహ‌నం లేదా […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:45 pm, Wed, 27 May 20
కస్టమర్లకు ఎస్‌బీఐ అల‌ర్ట్...అలా చేస్తే డ‌బుల్ ఫైన్..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు వార్నింగ్ ఇచ్చింది. బ్యాంక్ ఫాస్టాగ్స్ ఉపయోగిస్తున్న వారిని ప‌లు సూచ‌న‌లు చేసింది. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తాజా రూల్స్ పాటించాల‌ని కస్టమర్లను కోరింది. లేదంటే భారీ ఫైన్స్ త‌ప్ప‌వ‌ని హెచ్చరించింది. ఈ మేరకు ఎస్‌బీఐ ఒక ట్వీట్ చేసింది. ఎస్‌బీఐ ఫాస్టాగ్స్ ఉపయోగిస్తున్న వాహనదారులు అందరూ గ‌వ‌ర్న‌మెంట్ రూల్స్ పాటించాల‌ని ఎస్‌బీఐ కోరింది. ఫాస్టాగ్ లేని వెహిక‌ల్ లేదా ఫాస్టాగ్ ఉప‌యోగించ‌ని వాహ‌నం లేదా పనిచేయని ఫాస్టాగ్ పెట్టుకున్న వాహనం టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ లైన్‌లోకి వెలితే డబుల్ ఫైన్ కట్టాల్సి వస్తుందని స్టేట్ బ్యాంక్ పేర్కొంది.

నాన్ ఫంక్షనల్, ఇన్‌వాలిడ్ ఫాస్టాగ్స్ ఉపయోగించే వాహనదారులు డబుల్ జ‌రిమానా ఎదుర్కొవాల్సి వ‌స్తోంద‌ని ఇప్ప‌టికే కేంద్ర ప్రభుత్వం ప‌లుమార్లు హెచ్చరించింది. ఈ క్ర‌మంలో స్టేట్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు వార్నింగ్ సైన్స్ ఇచ్చింది. అందరూ ప్రభుత్వ నియ‌మ‌ నిబంధనలను ఫాలో అవ్వాల‌ని కోరింది.

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ నిబంధ‌న‌ల‌ను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ ప‌ద్దతిని అమలు చేస్తోంది. వాహనదారులు ఫాస్టాగ్స్ తీసుకుంటే.. టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేకుండానే టోల్ చార్జీలు పే చేయెచ్చు. ఆటోమెటిక్ స్కానింగ్ ద్వారా చార్జీలు క‌ట్ అవుతాయి. చాలా స‌మ‌యం కూడా ఆదా అవుతుంది.