AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలుషిత ఆహారంతో 22మందికి అస్వస్థత.. ముగ్గురి చిన్నారుల పరిస్థితి విషమం..!

ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సాంప్రదాయ పూజ ప్రాణాల మీదికి తెచ్చింది. ఫుడ్ పాయిజన్ తో 22 మంది ఆస్పత్రిపాలు కాగా.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌నాయక్‌ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఓ కుటుంబంలో స్థానిక సంప్రదాయ పూజ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి సమర్పించిన నైవేద్యాన్ని బుధవారం ఉదయం ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కల వారు ప్రసాదంగా స్వీకరించారు. కొద్ది గంటల వ్యవధిలోనే […]

కలుషిత ఆహారంతో 22మందికి అస్వస్థత.. ముగ్గురి చిన్నారుల పరిస్థితి విషమం..!
Balaraju Goud
|

Updated on: May 27, 2020 | 5:39 PM

Share

ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సాంప్రదాయ పూజ ప్రాణాల మీదికి తెచ్చింది. ఫుడ్ పాయిజన్ తో 22 మంది ఆస్పత్రిపాలు కాగా.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌నాయక్‌ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఓ కుటుంబంలో స్థానిక సంప్రదాయ పూజ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి సమర్పించిన నైవేద్యాన్ని బుధవారం ఉదయం ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కల వారు ప్రసాదంగా స్వీకరించారు. కొద్ది గంటల వ్యవధిలోనే ప్రసాదం తిన్న దాదాపు 22 మందికి వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన ఉట్నూరు‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఏడుగురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నారు. వారిలో చిన్నారులు రిషిత(3), నైనక్‌(2), సూరజ్‌(3)ల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఉట్నూరు రెవిన్యూ అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మెరుగైన చికిత్స కోసం వైద్యులతో చర్చించారు.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
చక్కెర డబ్బాలో చీమల దండయాత్ర.. ఈ ఒక్క వస్తువుంటే దెబ్బకు పరార్..
చక్కెర డబ్బాలో చీమల దండయాత్ర.. ఈ ఒక్క వస్తువుంటే దెబ్బకు పరార్..
టీ20 ప్రపంచకప్‌ జట్టులో తుఫాన్ ప్లేయర్.. అసలెవరీ నందినీ శర్మ..?
టీ20 ప్రపంచకప్‌ జట్టులో తుఫాన్ ప్లేయర్.. అసలెవరీ నందినీ శర్మ..?
సమ్మర్‌లో గుడ్లు తినడం మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే?
సమ్మర్‌లో గుడ్లు తినడం మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే?
పిల్లల లంచ్ బాక్స్ మధ్యాహ్నానికి పాడైపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే
పిల్లల లంచ్ బాక్స్ మధ్యాహ్నానికి పాడైపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే