మరో రికార్డు దిశగా మేఘా.. ఈసారి ఏంటంటే ?

తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ మరో రికార్డు సృష్టించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో పోలవరం నిర్మాణ పనులను చేజిక్కించుకున్న మేఘా ఇంజీనీరింగ్ సంస్థ.. పనుల్లో దూకుడు ప్రదర్శిప్తోంది. పోలవరం నిర్మాణ పనులు వేగం పెంచేందుకు సిద్ధమయింది మేఘా కంపెనీ. ఇందుకోసం ప్రాజెక్ట్ ప్రాంతంలో నిల్వ నీటిని వేగంగా తొలగిస్తున్నారు మేఘా సిబ్బంది. దాంతో స్పిల్‌వే తోపాటు […]

మరో రికార్డు దిశగా మేఘా.. ఈసారి ఏంటంటే ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 06, 2019 | 3:51 PM

తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ మరో రికార్డు సృష్టించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో పోలవరం నిర్మాణ పనులను చేజిక్కించుకున్న మేఘా ఇంజీనీరింగ్ సంస్థ.. పనుల్లో దూకుడు ప్రదర్శిప్తోంది.
పోలవరం నిర్మాణ పనులు వేగం పెంచేందుకు సిద్ధమయింది మేఘా కంపెనీ. ఇందుకోసం ప్రాజెక్ట్ ప్రాంతంలో నిల్వ నీటిని వేగంగా తొలగిస్తున్నారు మేఘా సిబ్బంది. దాంతో స్పిల్‌వే తోపాటు ఇతర నిర్మాణ ప్రాంతాల్లో క్రమక్రమంగా నిల్వ  నీరు తగ్గిపోతోంది. నీటి నిల్వలను త్వరగా తొలగించేందుకు ప్రత్యేక నిఫుణులను రంగంలోకి దింపారు.
కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ అక్కడ పని చేసిన ఇంజినీరింగ్ ఎక్స్‌పర్ట్స్‌ని పోలవరం పిలిచింది. దాంతో కొన్ని ప్రత్యేక బ‌ందాలు పోలవరం చేరుకున్నాయి. మరోవైపు కొన్ని చోట్ల నిర్మాణ పనులకు అడ్డంకిగా మారిన నీటి నిల్వలను యుద్దప్రాతిపదికన తొలగించేందుకు భారీ మోటార్లను వినియోగిస్తున్నారు.
అయితే.. ఇటీవలి వర్షాలకు కట్ట తెగిపోవడంతో… ఎత్తిపోసిన నీరు తిరిగి స్పిల్‌వేలోకి చేరుకుంటుంది. దాంతో ఆ నీటిని మళ్ళించేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. స్పిల్ వేలో వున్న మట్టిని తొలగించడం ద్వారా నీరు అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం భారీ క్రేన్లను వినియోగిస్తోంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..