అదుపు తప్పిన స్పైస్‌జెట్…

సోమవారం మహారాష్ట్రలోని షిర్డి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతోన్న స్పైస్‌జెట్‌ విమానం రన్‌వే మీద అదుపుతప్పి జారిపోయింది. దిగాల్సిన ప్రదేశానికి 30 నుంచి 40 మీటర్లు దూరంగా విమానం భూమిని తాకి అదుపుతప్పింది. దీంతో ప్రస్తుతానికి షిర్డి విమానాశ్రయంలో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. కానీ విమానాశ్రయ కార్యకలాపాలపై మాత్రం ప్రభావం పడిందని తెలిపింది. ఆ సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారో సమాచారం లేదు.

అదుపు తప్పిన స్పైస్‌జెట్...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 29, 2019 | 9:33 PM