ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా నెగటివ్..
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా వీడియో విడుదల చేశారు. ''నాన్నగారు కోలుకుంటున్నారు. ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది...
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా వీడియో విడుదల చేశారు. ”నాన్నగారు కోలుకుంటున్నారు. ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది. అయితే ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పెళ్లిరోజు సందర్భంగా అమ్మానాన్నలు ఇద్దరూ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. నాన్న రాయగలుగుతున్నారు. ఐపీఎల్ మ్యాచుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు’ అని వీడియోలో ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. (SPB Latest Health Update)
#Spb health update 7/9/20https://t.co/0ttuE3TR5Y
— S. P. Charan (@charanproducer) September 7, 2020