AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దక్షిణ కొరియాలో ఇవాళ్టి నుంచి మరిన్ని అంక్షలు

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పడప్పుడే వదిలేలా కనిపించడంలేదు. వ్యాక్సిన్ వస్తే గానీ కట్టడి పడేటట్లు లేదు. దక్షిణ కొరియాలో కేసుల సంఖ్య పెరగడంతో వినోదానికి చెందిన ప్రదేశాలపై ఆంక్షలు విధించడానికి ఆ దేశ ప్రభుత్వం సిద్దమైంది. నైట్ క్లబ్‌లు, కచేరీలు జరిగే బార్‌లను, ఇంటర్నెట్ కేఫ్‌లను మరోసారి మూసివేయాలని నిర్ణయించింది.

దక్షిణ కొరియాలో ఇవాళ్టి నుంచి మరిన్ని అంక్షలు
Balaraju Goud
|

Updated on: Aug 23, 2020 | 4:00 PM

Share

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పడప్పుడే వదిలేలా కనిపించడంలేదు. వ్యాక్సిన్ వస్తే గానీ కట్టడి పడేటట్లు లేదు. దక్షిణ కొరియాలో కేసుల సంఖ్య పెరగడంతో వినోదానికి చెందిన ప్రదేశాలపై ఆంక్షలు విధించడానికి ఆ దేశ ప్రభుత్వం సిద్దమైంది. నైట్ క్లబ్‌లు, కచేరీలు జరిగే బార్‌లను, ఇంటర్నెట్ కేఫ్‌లను మరోసారి మూసివేయాలని నిర్ణయించింది. అంతేకాదు, క్రీడలు జరిగే ప్రదేశాల్లో ప్రేక్షకులు పాల్గొనకుండా ఆంక్షలు విధించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న బీచ్‌లను కూడా కొద్ది రోజుల పాటు మూసివేయాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. ఇక, ఈ ఆంక్షల్లో భాగంగా ఇండోర్ మీటింగుల్లో 50 మంది.. ఔట్ డోర్ మీటింగుల్లో 100 మందికి మించకుండా జన సమీకరణ ఉండేలా నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ఆంక్షలన్నీ ఆదివారం నుంచే అమలులోకి వస్తాయని దక్షిణ కొరియా ఆరోగ్యశాఖ మంత్రి పార్క్ న్యూంగ్-హూ వెల్లడించారు. శుక్రవారం, శనివారం రోజుల్లో దక్షిణ కొరియాలో భారీగా కేసులు బయటపడ్డాయి. సియోల్ మెట్రో పాలిటన్ ప్రాంతం నుంచే అత్యధిక కేసులు వెలుగుచూసినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా.. తక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఈ ఆంక్షలను తప్పనిసరిగా కాకుండా నిబంధనలను అమలు చేయనున్నట్లు పార్క్ న్యూంగ్-హూ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం అదుపు చేయని విధంగా కరోనాను దక్షిణ కొరియా అదుపు చేయగలిగింది. అయితే, కొద్ది రోజుల నుంచి దేశంలో మరోమారు మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో ప్రభుత్వం మరోసారి నియంత్రణ చర్యలు తీసుకుంటోంది. కాగా.. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 17,002 కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా 309 మంది మృత్యువాతపడ్డారు

Follow Us
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా..
లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా..
అన్నం–ఐస్‌క్రీమ్ కాంబో నా ఫేవరెట్‌.. స్టార్‌‌ హీరోయిన్‌
అన్నం–ఐస్‌క్రీమ్ కాంబో నా ఫేవరెట్‌.. స్టార్‌‌ హీరోయిన్‌
ప్రశాంతమైన నిద్రకు టెక్నిక్ కనిపెట్టిన చిన్నారి
ప్రశాంతమైన నిద్రకు టెక్నిక్ కనిపెట్టిన చిన్నారి
5 రోజుల ఉపవాస దీక్షలో సంచలన నిజాలు
5 రోజుల ఉపవాస దీక్షలో సంచలన నిజాలు