శ్రీనివాసుని సన్నిధిలో స్నపన తిరుమంజనం ఏర్పాట్లు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీనివాసుని సన్నిధిలో స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీటీటీ ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల్లోని 2,3,4,9 రోజుల్లో ఈ స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని..

శ్రీనివాసుని సన్నిధిలో స్నపన తిరుమంజనం ఏర్పాట్లు
Follow us

|

Updated on: Sep 20, 2020 | 2:08 PM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీనివాసుని సన్నిధిలో స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీటీటీ ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల్లోని 2,3,4,9 రోజుల్లో ఈ స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉత్సవాల్లో చోటు చేసుకునే దోషాల నివారణ కోసం ఈ స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కొబ్బరినీళ్లు, తేనె, గంధం, వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం చేస్తారు. ఆ తర్వాత పసుపుతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని అలంకరించి తులసిమాల ధరింపజేసి స్నపనం నిర్వహిస్తారు. పసుపు నీళ్లతో అభిషేకం చేయడాన్ని స్నపనం అంటారు. ఈ కార్యక్రమం అంతా ఆలయంలోని రంగ నాయకుల మండపంలో నిర్వహిస్తారు. వక్కచెట్టు, తమలపాకులు, తులసిగింజలు, తామరపువ్వుల గింజలతో తయారు చేసిన మాలలు, కిరీటాలతో పాటు ప్రత్యేకించి పసుపుకొమ్ములు, ఒట్టివేరుతో మాలలను ఇందుకోసం రూపొందించారు. ఉత్సవమూర్తులు కొలువైన మండపాన్ని ద్రాక్ష, బత్తాయిలు, వివిధ రకాల పండ్లతో అలంకరించారు.