AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone Sales: పండగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రికార్డులు సృష్టించనున్నాయి.. ఎంత అంచనా వేస్తున్నారంటే..

ఈ ఏడాది పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో రూ.58,400 కోట్లకు చేరుకోవచ్చు. 2017 పండుగ సీజన్‌లో, రూ .27,700 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకం జరిగింది.

Smartphone Sales: పండగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రికార్డులు సృష్టించనున్నాయి.. ఎంత అంచనా వేస్తున్నారంటే..
Smart Phone Sales
KVD Varma
|

Updated on: Oct 22, 2021 | 2:13 PM

Share

Smartphone Sales: ఈ ఏడాది పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో రూ.58,400 కోట్లకు చేరుకోవచ్చు. 2017 పండుగ సీజన్‌లో, రూ .27,700 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకం జరిగింది. ఇప్పుడు అంచనాలను చేరుకుంటే కనుక గత 5 సంవత్సరాల అమ్మకాల కంటే ఇది 111% ఎక్కువ అవుతుంది. వాస్తవానికి, గత సంవత్సరం పండుగ సీజన్ కరోనా మహమ్మారి ఆంక్షల కారణంగా నిస్తేజంగా ఉంది. ప్రస్తుతం ఆంక్షల సడలింపు నేపధ్యంలో మార్కెట్లో డిమాండ్ పెరగడం కూడా మార్కెట్‌ను వెలిగిస్తోంది.

మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ అంచనా ప్రకారం అక్టోబర్ మొదటి వారం నుండి ప్రారంభమయ్యే పండుగ సీజన్‌లో భారతదేశంలో రూ .58,400 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడవుతాయి. స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ చిప్ కొరతను ఎదుర్కొంటున్న నేపధ్యంలో ఇది పెద్ద విక్రయాల పరంపర అని చెప్పవచ్చు. చిప్ కొరత కారణంగా విడిభాగాల ధర పెరిగింది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌లు ఖరీదైనవిగా మారాయి. 2017 లో స్మార్ట్‌ఫోన్‌ల సగటు విక్రయ ధర (ASP) రూ .12,900 కాగా, కౌంటర్‌పాయింట్ అంచనా ప్రకారం ఈ సంవత్సరం, స్మార్ట్‌ఫోన్‌ల పండుగ ASP 33% కంటే ఎక్కువ పెరిగి రూ .17,200 కి చేరుకుంటుంది. అయినప్పటికీ, బలమైన డిమాండ్ ఉంది. ఈ సంవత్సరం చాలా ఆర్థిక సంస్థలు దూకుడుగా కస్టమర్లకు ఈఎంఐ (EMI) సేవలను అందిస్తున్నాయి. అందుకే ప్రజలు ఖరీదైన ఫోన్‌లను కూడా కొనుగోలు చేస్తున్నారు.

భారతదేశంలో ప్రతి సంవత్సరం పండుగల సమయంలో స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. కానీ ఈ సంవత్సరం డిమాండ్ పెరుగుదల వేగం చాలా వేగంగా ఉంది. పెరిగిన డిమాండ్ మధ్య, మిడ్ , ప్రీమియం విభాగంలో దూకుడుగా ప్రచారం చేయడం దీని వెనుక ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పండగ సందర్భంగా ఆన్లైన్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్లైన్ లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు ఇచ్చిన ఆఫర్లతో వినియోగదారులు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేశారు. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగే అవకాశం ఉంది. దీంతో రికార్డు స్థాయిలో అమ్మకాలు ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Knife: ఇదో సూపర్ కత్తి.. స్టీల్‌తో చేసింది కాదు..నాన్ వెజ్ కూడా స్మూత్ గా కట్ చేయొచ్చు..దీనిని దేనితో చేశారో తెలుసా?

Cyber Security: సైబర్ సెక్యూరిటీ ఛాలెంజింగ్‌గా మారిన నేపథ్యంలో తెలంగాణలో యావత్ దేశానికే పయినీర్‌లా ఉండే పాలసీ

Pakistan: మళ్ళీ గ్రే లిస్టులో పాకిస్తాన్‌.. టెర్రరిజానికి కొమ్ము కాస్తున్నందుకు రెట్టింపైన పాక్ కష్టాలు!