‘కాంగ్రెస్ మా శత్రువు కాదే’ ! సంజయ్ సన్నాయినొక్కులు

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య లుకలుకలు ఇంకా కొనసాగుతుండగా.. సేన సీనియర్ నేత.. ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం కొత్త ‘ ప్రతిపాదన ‘ తెర పైకి తెచ్చారు. రాష్ట్రంలో ఎవరూ (ఏ పార్టీ కూడా) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాని పక్షంలో.. తామే ఇందుకు బాధ్యత వహిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకేమీ శత్రువు కాదని ‘ సన్నాయి నొక్కులు నొక్కారు ‘. కొన్ని అంశాలపై అన్ని పార్టీలకూ విభేదాలు ఉండడం సహజమేనన్నారు. అంటే.. […]

'కాంగ్రెస్ మా శత్రువు కాదే' ! సంజయ్ సన్నాయినొక్కులు
Follow us

|

Updated on: Nov 10, 2019 | 5:26 PM

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య లుకలుకలు ఇంకా కొనసాగుతుండగా.. సేన సీనియర్ నేత.. ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం కొత్త ‘ ప్రతిపాదన ‘ తెర పైకి తెచ్చారు. రాష్ట్రంలో ఎవరూ (ఏ పార్టీ కూడా) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాని పక్షంలో.. తామే ఇందుకు బాధ్యత వహిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకేమీ శత్రువు కాదని ‘ సన్నాయి నొక్కులు నొక్కారు ‘. కొన్ని అంశాలపై అన్ని పార్టీలకూ విభేదాలు ఉండడం సహజమేనన్నారు. అంటే.. బీజేపీతో పూర్తిగా కటీఫ్ అయినప్పుడో, ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినప్పుడో కాంగ్రెస్ తో కలిసి సర్కార్ ఏర్పాటుకు తాము రెడీ అని సంజయ్ చెప్పకనే చెప్పారు. ఇక కాంగ్రెస్ కూడా సేనకు మద్దతునివ్వడానికి సుముఖంగానే ఉంది. సేనకు సపోర్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నిర్ణయించారు,. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ‘ ఎగరేసుకుపోకుండా ‘ చూసేందుకు కాంగ్రెస్ నాయకత్వం 34 మంది సభ్యులను రాజస్థాన్ కు తరలించింది. ఆ రాష్ట్రంలో వారు ఓ రిసార్టులో సేద దీరుతున్నారు. (అయితే మహారాష్ట్రలో మొత్తం 44 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు చెందినవారు). ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఊసెత్తని శివసేన ఇప్పుడు.. పవర్ కోసం ఆశగా ఆ పార్టీ వైపు చూస్తోంది. అయితే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మద్దతుకోసం ప్రయత్నించినా.. కాంగ్రెస్ మద్దతుతో తామే ప్రభుత్వం ఏర్పాటుకు ‘ పెద్దాయన ‘ (పవార్) తహతహలాడారు. ఇదే ఆశతో ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. కానీ అక్కడ ఆమె నుంచి ఆయనకు సానుకూల స్పందన రాకపోవడంతో. ప్రభుత్వం ఏర్పాటుకు పెద్ద పార్టీగా అవతరించిన పార్టీనే (బీజేపీనే) గవర్నర్ ఆహ్వానించాలంటూ గళమెత్తుతున్నారు.