‘నిర్భయ’కు ఏడేళ్లు.. న్యాయమెక్కడ?

దేశ రాజధాని నడిబొడ్డున అత్యంత పాశవిక హత్యాచర ఘటన జరిగి నేటికి ఏడేళ్లు పూర్తయ్యాయి. ఏడాది క్రితం ఇదేరోజు నిర్భయ.. మృత్యువుతో పోరాడి తనువు చాలించింది. రాక్షసుల్లాగ ఆమెపై పడి.. పశువాంఛ తీసుకున్న మృగాళ్లు మాత్రం జైల్లో భద్రంగా ఉన్నారు. ఆమె పేరు మీద చట్టం తీసుకొచ్చి ఏం లాభమొచ్చింది. సంవత్సరాల తరబడి ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్లు జరుగుతూనే ఉన్నాయి. దోషులని తేలిన తర్వాత కూడా వారిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిర్భయ తల్లదండ్రులకు కూడా […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:28 am, Mon, 16 December 19
'నిర్భయ'కు ఏడేళ్లు.. న్యాయమెక్కడ?

దేశ రాజధాని నడిబొడ్డున అత్యంత పాశవిక హత్యాచర ఘటన జరిగి నేటికి ఏడేళ్లు పూర్తయ్యాయి. ఏడాది క్రితం ఇదేరోజు నిర్భయ.. మృత్యువుతో పోరాడి తనువు చాలించింది. రాక్షసుల్లాగ ఆమెపై పడి.. పశువాంఛ తీసుకున్న మృగాళ్లు మాత్రం జైల్లో భద్రంగా ఉన్నారు. ఆమె పేరు మీద చట్టం తీసుకొచ్చి ఏం లాభమొచ్చింది. సంవత్సరాల తరబడి ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్లు జరుగుతూనే ఉన్నాయి. దోషులని తేలిన తర్వాత కూడా వారిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిర్భయ తల్లదండ్రులకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ దోషులు మాత్రం.. వారికి క్షమాభిక్ష కావాలని కోరుతున్నారు.

తాజాగా.. నిర్భయ దోషులను ఇదే రోజు ఉరితీస్తున్నామని అనధికారకంగా సమాచారం వచ్చినా.. దానిపై ఇంకా అధికారికంగా సమాచారం లేదు. దేశంలో జరుగుతోన్న హత్యాచారాలను ప్యాన్ ఇండియా సమస్యగా నిర్భయ తల్లిదండ్రులు అభివర్ణించారు. హత్యాచార ఘటనల్లో నిందితులను చంపినా కూడా.. ప్రజల్లోనూ, న్యాయ వ్యవస్థలోనూ మార్పులు రావాలని వారు కోరారు. కాగా.. హైదరాబాద్‌లోని దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ని వారు సమర్ధించారు. అదే దోషులకు సరైన శిక్ష అని.. అలాగైతేనే వారు భయపడతారని పేర్కొన్నారు.

2012 డిసెంబర్‌ 16న మృగాళ్లు నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆమె స్నేహితుడిని గాయపరిచి, అత్యంత హేయంగా ఢిల్లీ విధుల్లో బస్సులో తిప్పుతూ ఆమెను చెరపట్టారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రాహావేశాలు చెలరేగాయి. ఈ కేసులో మైనర్‌ సహా ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. అయితే ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ కేసు విచారణ జరుగుతుండగానే 2013 మార్చి 11న తీహార్‌ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మైనర్‌‌కు జువైనల్ కోర్టు మూడేళ్ల శిక్ష విధించింది. అది పూర్తయిన అనంతరం అతడు 2015 డిసెంబర్‌ 20న విడుదలయ్యాడు.

మిగిలిన నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి 2017 మే 5న హైకోర్టు విధించిన ఉరి శిక్షనే సమర్ధించింది. చివరి ప్రయత్నంగా నిందితులు రాష్ట్రపతికి క్షమాబిక్ష పెట్టుకున్నారు. కానీ అటువంటి మృగాళ్లను కనికరించవద్దని ఢిల్లీ ప్రభుత్వం ప్రెసిడెంట్‌ను అభ్యర్థించింది. దీంతో రాష్ట్రపతి కోవింద్ కూడా క్షమాభిక్ష పిటీషన్‌ను తిరస్కరించడంతో ఉరిశిక్ష ఖరారు అయినట్లు తెలుస్తోంది. కానీ.. ఇంతవరకూ దానిపై క్లారిటీ రాలేదు.