AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ చీర‌తో క‌ట్టిన ఊయ‌లే..ఆ పాప‌కు ఉరితాడు అయ్యింది..

అమ్మ క‌ట్టిన ఊయలే ఆ చిన్న‌పిల్ల పాలిట ఉరితాడు అయ్యింది. ఊహించ‌ని విధంగా ఏడేళ్ల బాలిక ప్రాణాల‌ను ఉయ్యాల బ‌లిగొంది. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు ఇంట్లో టీవీ చూస్తూ ఉండ‌టంతో చిన్నారి అరుపులు వినిపించ‌లేదు. అటువైపు వెళ్తోన్న స్థానికుడు పాప‌ను గ‌మ‌నించి..కేక‌లు వేసినా..అప్ప‌టికే ప‌రిస్థితి చేజారిపోయింది. చిన్నార అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. హుటాహుటిన‌ ఆస్పత్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే చనిపోయిన‌ట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ తల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌య్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈ విషాద ఘ‌ట‌న‌ […]

అమ్మ చీర‌తో క‌ట్టిన ఊయ‌లే..ఆ పాప‌కు ఉరితాడు అయ్యింది..
Ram Naramaneni
|

Updated on: Apr 24, 2020 | 3:12 PM

Share

అమ్మ క‌ట్టిన ఊయలే ఆ చిన్న‌పిల్ల పాలిట ఉరితాడు అయ్యింది. ఊహించ‌ని విధంగా ఏడేళ్ల బాలిక ప్రాణాల‌ను ఉయ్యాల బ‌లిగొంది. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు ఇంట్లో టీవీ చూస్తూ ఉండ‌టంతో చిన్నారి అరుపులు వినిపించ‌లేదు. అటువైపు వెళ్తోన్న స్థానికుడు పాప‌ను గ‌మ‌నించి..కేక‌లు వేసినా..అప్ప‌టికే ప‌రిస్థితి చేజారిపోయింది. చిన్నార అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. హుటాహుటిన‌ ఆస్పత్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే చనిపోయిన‌ట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ తల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌య్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈ విషాద ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. దివ్యాంగుడైన‌ వలపర్ల రవికుమార్, కవిత దంపతులు సత్తుపల్లి సిటీలోని ఎన్‌వీఆర్‌ కాంప్లెక్స్ ‌రోడ్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి స్వర్ణిక (7), సాత్విక అనే ఇద్దరు కుమార్తెలున్నారు. రవికుమార్ సిటీలోని‌ ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట బడ్డీకొట్టు న‌డుపుతుండ‌గా.. కవిత జిరాక్స్‌ సెంటర్ నిర్వ‌హిస్తోంది.

గురువారం (ఏప్రిల్ 23) మధ్యాహ్నం పిల్లలకు అన్నం పెట్టిన అనంత‌రం కవిత.. భర్తతో కలిసి టీవీ చూస్తూ భోజనం చేస్తోంది. ఆ సమయంలో వారి పెద్ద కుమార్తె స్వర్ణిక..ఇంటి బ‌య‌ట చీరతో చెట్టుకు కట్టిన ఊయలలో కూర్చొని ఆడుటకుంటోంది. ఊయ‌లలో గుండ్రంగా తిరుగుతుండ‌గా..ఒక్క‌సారిగా ఆ చీర బాలిక మెడకు చుట్టుకొని బిగుసుకుపోమ‌యింది. దీంతో ఊపిరాడక అప‌స్మార‌క స్థితికి చేరుకుని ప్రాణాలు విడిచింది. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. లాక్ డౌన్ తో ఇంటి వ‌ద్ద‌నే ఉంటున్న పిల్ల‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకోవ‌డం త‌ల్లితండ్రుల బాధ్య‌తే.

మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌ షాక్.. లొంగిపోయిన 63 మంది నక్సలైట్స్!
మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌ షాక్.. లొంగిపోయిన 63 మంది నక్సలైట్స్!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. విద్యుత్ ఛార్జీలు తగ్గింపు.. ఎంతంటే
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. విద్యుత్ ఛార్జీలు తగ్గింపు.. ఎంతంటే
ఓరీ దేవుడో.. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ అద్దె నెలకు రూ. 8 ల‌క్ష‌లు..
ఓరీ దేవుడో.. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ అద్దె నెలకు రూ. 8 ల‌క్ష‌లు..
నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్.. ప్రభుత్వ సాయంతో రూ.50 వేలు
నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్.. ప్రభుత్వ సాయంతో రూ.50 వేలు
గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అతిగా తాగేస్తున్నారా?
గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అతిగా తాగేస్తున్నారా?
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అసలు కారణం ఇదే కావచ్చు!
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అసలు కారణం ఇదే కావచ్చు!
చిన్నప్పటి నుంచే నత్తి.. పాన్ ఇండియాను షేక్ చేసిన హీరో..
చిన్నప్పటి నుంచే నత్తి.. పాన్ ఇండియాను షేక్ చేసిన హీరో..
చలితో ఇబ్బందా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో శరీరానికి వెచ్చదనం
చలితో ఇబ్బందా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో శరీరానికి వెచ్చదనం
ప్రభాస్ జోకర్ గెటప్ వెనకున్నది దర్శకుడు మారుతీ కాదట.!
ప్రభాస్ జోకర్ గెటప్ వెనకున్నది దర్శకుడు మారుతీ కాదట.!
46 ఫ్రీ స్కూల్స్, 26 అనాథాశ్రమాలు కట్టించిన రియల్ హీరో
46 ఫ్రీ స్కూల్స్, 26 అనాథాశ్రమాలు కట్టించిన రియల్ హీరో