లాక్‌డౌన్ నేపథ్యంలో.. చపాతీల కోసం ‘రోటీ బ్యాంక్’!

కోవిద్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. లాక్‌డౌన్ క్రమంలో జీవనోపాధి కోల్పోయిన వలసకూలీలకు చపాతీలు అందించేందుకు నోయిడా నివాసులు ముందుకు వచ్చారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో.. చపాతీల కోసం ‘రోటీ బ్యాంక్’!
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2020 | 3:35 PM

కోవిద్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. లాక్‌డౌన్ క్రమంలో జీవనోపాధి కోల్పోయిన వలసకూలీలకు చపాతీలు అందించేందుకు నోయిడా నివాసులు ముందుకు వచ్చారు. నోయిడాలోని సొసైటీల్లో నివాసముంటున్న వారు కలిసి ఏప్రిల్ 12వతేదీన కూలీలకు 400 చపాతీలు చేసి అందించారు. ఆపత్కాలంలో కూలీల కడుపునింపేందుకు పలువురు స్థానికులు ముందుకురావడంతో వారంతా కలిసి రోటీ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు.

వివరాల్లోకెళితే.. స్థానికుల విరాళాలతో రోజుకు 4వేలమంది కూలీలకు చపాతీలు పంపిణీ చేసి వారి కడుపు నింపుతున్నారు. సెక్టారు 78లో చపాతీలు తయారు చేసి తాము సిద్ధంగా ఉంచితే నోయిడా అథారిటీ అధికారులు వాహనం పంపించి కూలీలకు పంపిణీ చేస్తున్నారని బ్రజేష్ శర్మ చెప్పారు. తమ సొసైటీ గేటు వద్ద ఖాళీ బాక్సులు ఉంచితే ఇంటికి నాలుగు చపాతీలు చొప్పున తయారు చేసి వాటిని బాక్సుల్లో వేస్తున్నారు. సాయంత్రం ఐదున్నర గంటలకల్లా చపాతీల బాక్సులు నిండగానే వాటిని నోయిడా అధికారుల వాహనంలో వేసి కూలీలకు పంపిణీ చేస్తున్నారు.

కాగా.. రోజుకు 400 చపాతీలు పంపడం ప్రారంభించామని, ఇప్పుడు 25 సొసైటీల నుంచి రోజుకు 15వేల చపాతీలు పంపిస్తున్నామని చెప్పారు. రోటీబ్యాంకు కేవలం 11 రోజుల్లో లక్షకు పైగా చపాతీలను కూలీలకు పంపిణీ చేశామని నోయిడా వాసులు చెప్పారు.