రెండు విమానాలు ఢీ.. శాసన సభ్యుడు సహా ఏడుగురు మృతి..
అమెరికాలోని అలస్కాలో రెండు విమానలు ఢీ కొనడంతో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో అలస్కా రాష్ట్ర శాసన సభ్యులు గ్యారీ నాప్ కూడా ఉన్నారు. సాల్డోట్నా విమానాశ్రయానికి రెండు మైళ్ల దూరంలో రెండు విమానాలు ఢీ కొన్నాయని స్థానిక పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్..

అమెరికాలోని అలస్కాలో రెండు విమానలు ఢీ కొనడంతో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో అలస్కా రాష్ట్ర శాసన సభ్యులు గ్యారీ నాప్ కూడా ఉన్నారు. సాల్డోట్నా విమానాశ్రయానికి రెండు మైళ్ల దూరంలో రెండు విమానాలు ఢీ కొన్నాయని స్థానిక పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. అక్కడి కాలమాన ప్రకారం శుక్రవారం ఉదయం సుమారు 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
రెండు తేలికపాటి విమానాల్లో ఒకటి సింగిల్ ఇంజన్ కలిగిన హావిల్లాండ్ డీహెచ్‌సీ-2 బీవర్ విమానం, మరొకటి పైపర్-పీఏ 12 విమానమని తెలిపారు. ఒకే ఇంజన్ కలిగిన విమానంలో ఒక్కరే ఉండగా, మరో విమానంలో ఏడుగురు ప్రయాణిస్తున్నారని అక్కడి ప్రజా సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. శాసన సభ్యులు గ్యారీ నాప్ స్వయంగా విమానం నడిపారని సమాచారం. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడినట్టు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read More:
ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు టీ షర్ట్స్, జీన్స్ ధరించడం నిషేధం!