వేగం పెంచిన సీరం ఇన్స్టిట్యూట్… 2 వారాలలో కోవిడ్ వ్యాక్సిన్.. అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు
రాబోయే రెండు వారాల్లో కోవిషీల్డ్ యొక్క అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసే పనిలో ఉందని ఈ సంస్థ సిఇఒ అదార్ పూనవల్లా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం..
COVIDVaccine : కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిలో వేగం పెంచాయి పరిశోధన కంపెనీలు. సాధ్యమైనంత త్వరగా టీకాను అందించాలన్న ఉద్దేశంతో ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ బృందం చాలా కృషి చేస్తోంది. ఇప్పటివరకు నిర్వహించిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇందుకుగాను శాస్త్రవేత్తల బృందాన్ని ప్రధాని అభినందించిన విషయం తెలిసిందే. తాజాగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2 వారాలలో కోవిడ్ వ్యాక్సిన్ యొక్క అత్యవసర ఉపయోగం కోసం దరఖాస్తు కూడా చేసుకుంది.
రాబోయే రెండు వారాల్లో కోవిషీల్డ్ యొక్క అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసే పనిలో ఉందని ఈ సంస్థ సిఇఒ అదార్ పూనవల్లా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం పూనవల్లా మాట్లాడుతూ.., వ్యాక్సిన్‌ని మొదట భారత్‌లోనే డిస్ట్రిబ్యూట్ చేస్తామని, ఆ తరువాతే ఆఫ్రికాలోని కోవాక్స్ దేశాలకు అందిస్తామని పూనావల్లా స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్త ప్రతి ఒక్కరూ భారతదేశం నుంచి సరసమైన ధరలకు వచ్చే టీకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే కరోనా కోసం 50 నుండి 60 శాతం వ్యాక్సిన్‌లు ఇక్కడే తయారవుతున్నాయి.