లాభాలతో స్టాక్ మార్కెట్లు…
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 సమయంలో నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి.. 39,617 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగి 11,894 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్లో ముఖ్యంగా ఐటీ , విద్యుత్తు,ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్నాయి. పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, భారత్ పెట్రోలియం, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. ఇక సెన్సెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, […]
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 సమయంలో నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి.. 39,617 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగి 11,894 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఇవాళ మార్కెట్లో ముఖ్యంగా ఐటీ , విద్యుత్తు,ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్నాయి. పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, భారత్ పెట్రోలియం, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. ఇక సెన్సెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
కాగా, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిన్న రాత్రి వాల్‌స్ట్రీట్ సూచీలు నష్టాల్లో ముగియడంతో ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరడంతో ఈ పరిస్థితి నెలకొంది. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.8శాతం పతనమైంది. జపాన్‌కు చెందిన నిక్కీ 0.85శాతం కుంగింది.