అందుకే బాలీవుడ్‌కి దూరమయ్యా.. సీనియర్ నటి రమ్యకృష్ణ వ్యాఖ్యలు

ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దక్షిణాదిన అందరి హీరోలతోనూ నటించి అగ్ర హీరోయిన్‌గా వెలుగొందారు. అనంతరం హీరోయిన్‌ నుంచి క్యారెక్టర్ రోల్స్‌కు మారిన తర్వాత కూడా ఆమె మంచి అవకాశాలు అందుకున్నారు. ఇక 'బాహుబలి' సినిమాతో ఆమె మరో రేంజ్‌కు ఎదిగారనే...

అందుకే బాలీవుడ్‌కి దూరమయ్యా.. సీనియర్ నటి రమ్యకృష్ణ వ్యాఖ్యలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 18, 2020 | 2:16 PM

ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దక్షిణాదిన అందరి హీరోలతోనూ నటించి అగ్ర హీరోయిన్‌గా వెలుగొందారు. అనంతరం హీరోయిన్‌ నుంచి క్యారెక్టర్ రోల్స్‌కు మారిన తర్వాత కూడా ఆమె మంచి అవకాశాలు అందుకున్నారు. ఇక ‘బాహుబలి’ సినిమాతో ఆమె మరో రేంజ్‌కు ఎదిగారనే చెప్పాలి. ఉత్తరాదినే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఫైటర్‌’తో మరోసారి బాలీవుడ్‌ని పలకరించబోతున్నారు.

కాగా రమ్యకష్ణ హీరోయిన్‌గా ఉన్నప్పుడే బాలీవుడ్ సినిమాల్లో నటించారు. ‘క్రిమినల్, కల్‌నాయక్, బడేమియా చోటేమియా’ వంటి హిందీ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత క్రమంగా బాలీవుడ్‌కు దురమై దక్షిణాది చిత్రాలపైనే పూర్తి దృష్టి సారించారు. ఈ విషయమై రమ్యకృష్ణ తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానెల్‌తో మాట్లాడుతూ… ‘నేను బాలీవుడ్‌‌లో సక్సెస్ కాలేకపోయాను. నా సినిమాలేవీ అక్కడ మంచి హిట్ సాధించలేకపోయాయి. దాంతో అక్కడి నుంచి నాకు మంచి అవకాశాలు రాలేదు. అందుకే బాలీవుడ్‌కి దూరమయ్యా’. కానీ దక్షిణాదిన మాత్రం మంచి సినిమాలు చేశానని తెలిపారు రమ్యకృష్ణ.

Read More:

అశ్రు నయనాల మధ్య కల్నల్ సంతోష్‌ అంత్యక్రియలు పూర్తి…

ఏపీలో టెర్రర్ సృష్టిస్తోన్న కరోనా.. ఒక్క రోజులో 425 కేసులు

నిహారిక ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పెళ్లి ఫిక్స్ అయిందా?