కోజికోడ్‌లో అక్ర‌మ బంగారం ప‌ట్టివేత‌

కేరళలోని కోజికోడ్ విమానాశ్ర‌యం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. అత్యంత చాకచక్యంగా తీసుకువస్తున్న ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకోవడంతో పసిడి బయటపడింది.

కోజికోడ్‌లో అక్ర‌మ బంగారం ప‌ట్టివేత‌
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 13, 2020 | 3:16 PM

కేరళలోని కోజికోడ్ విమానాశ్ర‌యం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. అత్యంత చాకచక్యంగా తీసుకువస్తున్న ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకోవడంతో పసిడి బయటపడింది. గుట్టుచప్పడు కాకుండా తరలిస్తున్న బంగారాన్ని కోజికోడ్ విమానాశ్ర‌యంలో ఎయిర్ ఇంట‌లిజెన్స్ యూనిట్ అధికారులు ప‌ట్టుకున్నారు. షార్జా నుంచి ఎయిర్ అరేబియా విమానంలో ఇద్ద‌రు ప్ర‌యాణికులు కోజికోడ్‌కు వ‌చ్చారు. ప్ర‌యాణికుల త‌నిఖీల్లో భాగంగా అధికారులు వీరివ‌ద్ద నుంచి 230 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానంతో ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేయగా, సాక్సుల్లో పెట్టి తీసుకువ‌స్తున్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా మ‌రొక ఘ‌ట‌న‌లో కేరళకు చెందిన క‌స్ట‌మ్స్ అధికారులు దుబాయ్ నుంచి వ‌చ్చిన మరో ఇద్ద‌రు ప్ర‌యాణికుల వ‌ద్ద నుంచి 932 గ్రాముల బంగారం, 45 కార్టన్ల సిగ‌రెట్లు, నాలుగు యాపిల్ ఐ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ బ్యాగు ఫ్రేమ్‌గా అమ‌ర్చి తీసుకువస్తుండగా గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. మరో మ‌హిళా ప్ర‌యాణికురాలి నుంచి 77 గ్రాముల బ‌రువున్న నాలుగు బంగారు బిస్కెట్ల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు ఘటనలకు సంబంధించి సొత్తును స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.