కరోనా బాధితులకు శుభవార్త..!

కరోనాపై యుద్దంలో మేముసైతం అంటూ ముందుకొచ్చారు రైల్వే శాఖ. వైద్య సిబ్బందికి సాయం అందించడానికి దక్షిణ మధ్య రైల్వే ఒక రోబోను అభివృద్ధి చేసింది. దీనికి రైల్‌బోట్‌(ఆర్‌-బోట్‌)గా నామకరణం చేశారు. ఇది వైద్యులకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందించడంలో సహయపడుతుందంటున్నారు రైల్వేఅధికారులు.

కరోనా బాధితులకు శుభవార్త..!
Follow us

|

Updated on: Sep 01, 2020 | 3:06 PM

కరోనాపై యుద్దంలో మేముసైతం అంటూ ముందుకొచ్చారు రైల్వే శాఖ. వైద్య సిబ్బందికి సాయం అందించడానికి దక్షిణ మధ్య రైల్వే ఒక రోబోను అభివృద్ధి చేసింది. దీనికి రైల్‌బోట్‌(ఆర్‌-బోట్‌)గా నామకరణం చేశారు. ఇది వైద్యులకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందించడంలో సహయపడుతుందంటున్నారు రైల్వేఅధికారులు. కేవలం డాక్టర్లకు మాత్రమే కాకుండా కరోనా పేషెంట్లకు ఆహారాన్ని కూడా అందిస్తుంది. ఈ రోబోను వైఫై, మొబైల్‌ యాప్‌ ద్వారా ఆపరేట్‌ చెయ్యొచ్చు. యాప్‌ ద్వారా ఏం చేయాలో సూచనలు ఇస్తే చాలు ఈ రోబో వాటికి తగ్గట్టుగా పనిచేస్తుంది. అంతేకాదు శరీర ఉష్ణోగ్రతను కూడా నిర్థారిస్తుంది. ఎవరికైనా ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు ఉంటే రోబోకు అమర్చిన రెడ్ లైట్ తో అలర్ట్ చేస్తుంది. దీంతో ఆ వ్యక్తిని త్వరగా ఐసోలేట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోబోకి అమర్చిన రియల్‌టైమ్‌ కెమెరా ద్వారా చుట్టూరా తిరుగుతూ పరిసరాలన్నింటిని రికార్డు చేస్తుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

వీటితో పాటు ఈ రోబోకు ఉన్న మరికొన్ని ప్రత్యేకతలు:

* ఇందులో నైట్‌ ల్యాంప్‌, నైట్‌ విజన్‌ కెమెరాలు కూడా ఫిక్స్‌ చేశారు. * ఇది కరెంటు లేని ప్రదేశాల్లో కూడా సేవలను అందిస్తుంది. * ఇది గంటకు ఒక కిలోమీటర్‌ దూరం వెళ్లగలదు. * 80 కేజీల కంటే ఎక్కువ బరువును మోయగలదు. * ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 7 గంటల పాటు నిరవధికంగా పనిచేస్తుంది. * ఇది వ్యక్తులతో కూడా మాట్లాడుతుంది. * వ్యక్తుల మాల్ని, తన మాటల్ని కూడా రికార్డు చేస్తోంది. * రియల్‌టైమ్‌ కెమెరా సాయంతో రోబో ఎక్కడి వెళుతుందో తెలుసుకోవచ్చు.