AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కేసుల్లో అధిక శాతం అక్కడే.. వాతావరణంలో తేమ, వేడితో కరోనా ప్రభావితం..!

కొవిడ్‌-19 ప్రపంచ దేశాలతో పాటు భారత్ నూ గడగడలాడిస్తోంది. అయితే ప్రపంచంలోని కరోనా కేసుల్లో అధిక శాతం తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తేమ లేదా ఆర్ద్రత తక్కువగా గల దేశాల్లోనే నమోదైనట్టు ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది.

కరోనా కేసుల్లో అధిక శాతం అక్కడే.. వాతావరణంలో తేమ, వేడితో కరోనా ప్రభావితం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 26, 2020 | 4:53 PM

Share

కొవిడ్‌-19 ప్రపంచ దేశాలతో పాటు భారత్ నూ గడగడలాడిస్తోంది. అయితే ప్రపంచంలోని కరోనా కేసుల్లో అధిక శాతం తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తేమ లేదా ఆర్ద్రత తక్కువగా గల దేశాల్లోనే నమోదైనట్టు ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 90 శాతం కరోనా కేసులు 3 నుంచి 17 డిగ్రీల ఉష్ణోగ్రత, గాలిలో తేమ 4-9 g/m3 కంటే తక్కువగా ఉన్న దేశాల్లోనే ఉన్నట్లు ఈ అధ్యయనం తెలియచేసింది. గత అభిప్రాయాలకు భిన్నంగా, ఉష్ణోగ్రత మాత్రమే కాకుండా ఆర్ద్రత కూడా కొవిడ్‌-19 వ్యాప్తిలో ముఖ్యపాత్ర పోషిస్తోందని ఎంఐటీకి చెందిన శాస్త్రవేత్తలు గణాంకాల విశ్లేషణ ద్వారా నిరూపించారు.

కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. చాల దేశాల్లో కరోనా వైరస్‌ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మార్చి 22 వరకు లభించిన కరోనా వైరస్‌ వ్యాప్తి సంబంధిత గణాంకాలను మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) అమెరికా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆ ఫలితాలను బట్టి కరోనా వైరస్‌ వ్యాప్తి ఉష్ణోగ్రత, వాతావరణంలో తేమ అనే రెండు అంశాలపై ఆధారపడి ఉందని వారు పేర్కొన్నారు. వేడి, తేమ అధికంగా ఉన్న వాతావరణం కరోనా వ్యాప్తిని నిరోధిస్తుందని వారు అంటున్నారు. భారత్‌తో సహా అన్ని ఆసియా దేశాల్లో రుతుపవనాల రాకతో గాలిలో తేమ 10g/m3 కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

కాగా.. ఇటలీ, ఇరాన్, స్పెయిన్, అమెరికా దేశాల్లో కరోనా మహమ్మ్మరి కరాళనృత్యం చేస్తోంది. ఉష్ణమండల వాతావరణ పరిస్థితులు కరోనా మహమ్మారి వ్యాప్తిని ఆలస్యం చేసాయని… దీనితో ప్రపంచవ్యాప్తం సుమారు 20,000 కరోనా మరణాలు నమోదుకాగా.. దేశంలో మరణాలు 10కి పరిమితం అయ్యాయని పరిశోధకులు విశ్లేషించారు. ఇతర దేశాల్లో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతుండగా.. 18 డిగ్రీ సెంటిగ్రేడ్‌ కంటే ఎక్కువున్న ఉష్ణమండల దేశాల్లో గతవారం మొత్తానికి 10,000 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఇందుకు కారణం ఈ ప్రాంతాల్లో అధిక వేడి, తేమ ఉండటమే అని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

Follow Us