తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం క్లారిటీ..!
రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ప్రభుత్వం కోర్టుకు స్పష్టంచేసింది.
Schools to reopen in Telangana: రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ప్రభుత్వం కోర్టుకు స్పష్టంచేసింది. ఆన్‌లైన్ తరగతులు, పాఠశాలల పునఃప్రారంభంపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. విద్యా సంవత్సరం ఖరారు చేసే పనిలో ఉన్నామని నివేదికలో పేర్కొంది. పాఠశాలల ప్రారంభంపై తల్లిదండ్రుల ఫీడ్‌బ్యాక్ సమర్పించాలని డీఈవోలను ఆదేశించినట్లు ప్రభుత్వం తెలిపింది. విద్యా సంవత్సరం, ఆన్‌లైన్ తరగతులపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది.
Also Read: నేటి నుంచి సంతలు బంద్.. రూల్స్ అతిక్రమిస్తే జరిమానా, కేసులు నమోదు..