నేటి నుంచి సంతలు బంద్.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా..
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు పలు చర్యలు చేపట్టిన ప్రజల నిర్లక్ష్యం కారణంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అవసరమైతే తప్ప

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు పలు చర్యలు చేపట్టినా ప్రజల నిర్లక్ష్యం కారణంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అవసరమైతే తప్ప బయటకు ఎవరూ రావొద్దని అధికారులు సూచిస్తున్నప్పటికీ .. కారణాలు లేకున్నా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. అందుకే నేటి నుంచి మూడు వారాల పాటు సికిందరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా వారం వారం సంతలు నిర్వహించవద్దన్నారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే.. భారీ జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు.
కరోనా కట్టడికోసం జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వారంవారం బస్తీలు, కాలనీల్లో ఏర్పాటు చేసే సంతలను నేటి నుంచి 20 రోజుల పాటు పెట్టకూడదని అధికారులు నిర్ణయించారు. కూరగాయలు కొనుగోలు చేయడం కోసం ప్రజలు వారంవారం జరిపే సంతలకు వచ్చి భౌతికదూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జూలై 21 నుంచి నియోజకవర్గంలో ఎక్కడ కూడా సంతలు జరుపకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సంతలు నిర్వ హిస్తే కఠిన చర్యలతోపాటు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.