ఏపీలో సందడి: స్కూల్ విద్యార్ధుల కొవిడ్ ప్రతిజ్ఞ

ఆంధ్రప్రదేశ్‌లో ఏడు నెలల అనంతరం పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 9, 10 తరగతులకి నేటినుంచి క్లాసులు మొదలయ్యాయి. కొవిడ్ నేపథ్యంలో క్లాస్ రూములో శానిటైజర్లను టీచర్లు అందుబాటులో ఉంచారు. క్లాస్ లోకి వచ్చాక మాస్క్ కచ్చితంగా ఉండేలా సూచనలు చేశారు. క్లాస్ రూమ్ కి కేవలం 16మంది మాత్రమే ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రయివేట్ స్కూళ్లలో విద్యార్థులు పెద్దగా క్లాస్ కి హాజరుకాని దృశ్యాలు ఏపీలో కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ స్కూళ్లలో మాత్రం కాస్త మెరుగైన హాజరు ఉంది. స్కూళ్లలో […]

ఏపీలో సందడి: స్కూల్ విద్యార్ధుల కొవిడ్ ప్రతిజ్ఞ
Follow us

|

Updated on: Nov 02, 2020 | 12:11 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఏడు నెలల అనంతరం పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 9, 10 తరగతులకి నేటినుంచి క్లాసులు మొదలయ్యాయి. కొవిడ్ నేపథ్యంలో క్లాస్ రూములో శానిటైజర్లను టీచర్లు అందుబాటులో ఉంచారు. క్లాస్ లోకి వచ్చాక మాస్క్ కచ్చితంగా ఉండేలా సూచనలు చేశారు. క్లాస్ రూమ్ కి కేవలం 16మంది మాత్రమే ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రయివేట్ స్కూళ్లలో విద్యార్థులు పెద్దగా క్లాస్ కి హాజరుకాని దృశ్యాలు ఏపీలో కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ స్కూళ్లలో మాత్రం కాస్త మెరుగైన హాజరు ఉంది. స్కూళ్లలో మాస్క్ ధరిస్తామని, కోవిడ్ నిబంధనలు పాటిస్తామని, శాని టైజర్ వినియోగిస్తామని పిల్లల చేత ఉదయం ప్రతిజ్ఞ చేయించారు ఉపాధ్యాయులు. విద్యార్థులకు స్క్రినింగ్ టెస్ట్ చేసి క్లాస్ రూం లోపలకు పంపుతున్నారు. క్లాస్ రూంలో మాస్కులు ధరించి భౌతిక దూరంగా విద్యార్థులు కూర్చున్న దృశ్యాలు అన్ని పాఠశాలల్లోనూ కనిపిస్తున్నాయి.