AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్న మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఈ నెలలో వర్చ్యువల్ గా మూడు వేవేరు సమ్మిట్స్ లో పాల్గొననున్నారు. ఈ నెల 10 న స్ షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లోను, 17 న 'బ్రిక్స్' శిఖరాగ్ర సమావేశంలోనూ,

మూడు శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్న మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 02, 2020 | 11:59 AM

Share

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఈ నెలలో వర్చ్యువల్ గా మూడు వేవేరు సమ్మిట్స్ లో పాల్గొననున్నారు. ఈ నెల 10 న స్ షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లోను, 17 న ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశంలోనూ, 21-22 తేదీల్లో జీ-20 శిఖరాగ్ర సమావేశంలోనూ వారు పార్టిసిపేట్ చేస్తారు. బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో ఉన్న రష్యా రెండు సమ్మిట్స్ ను నిర్వహిస్తుంది. అయితే జీ-20 ని సౌదీ అరేబియా నిర్వహిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ,  జీ జిన్ పింగ్ భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనుంది. లడాఖ్ లో చైనా ఆక్రమణ గురించి మోదీ ఆయనతో ప్రస్తావిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అటు-ఏషియన్ వర్చ్యువల్ సమ్మిట్ ఈ నెల 13-15 తేదీల్లో జరుగుతుందని, వియత్నాం నిర్వహించే ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇండియాతో బాటు పాకిస్తాన్, చైనా దేశాలు కూడా పాల్గొంటాయని తెలుస్తోంది.