రోహిత్‌శర్మకు రవిశాస్త్రి సలహా
వీలైనంత తొందరగా మళ్లీ అడుగుపెట్టాలన్న తొందరపాటు పనికికాదని రోహిత్‌శర్మకు సలహా ఇచ్చాడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి. ఒకప్పుడు తాను ఇదే తప్పిదం చేశానని, దాని వల్ల అయిదేళ్ల కెరీర్‌ను వదులుకోవల్సి వచ్చిందని చెప్పాడు.

వీలైనంత తొందరగా మళ్లీ అడుగుపెట్టాలన్న తొందరపాటు పనికికాదని రోహిత్‌శర్మకు సలహా ఇచ్చాడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి. ఒకప్పుడు తాను ఇదే తప్పిదం చేశానని, దాని వల్ల అయిదేళ్ల కెరీర్‌ను వదులుకోవల్సి వచ్చిందని చెప్పాడు.. 1991లో తాను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లానని, నిజానికి అప్పుడు వెళ్లకుండా మూడునాలుగు నెలలు విశ్రాంతి తీసుకుంటే మరో అయిదేళ్ల పాటు భారత్‌కు ఆడి ఉండేవాడినని చెప్పుకొచ్చాడు.. డాక్టర్లు ఎంత వద్దన్నా తానే దురాశతో వ్యవహరించానని, ఉత్సాహం కొద్దీ ఆసీస్ టూర్‌కు వెళ్లానని, కోరి నష్టం కొని తెచ్చుకున్నానని రవిశాస్త్రి అన్నాడు.. స్వీయ అనుభవంతో చెబుతున్నానని, రోహిత్ కూడా తొందరపడకూడదని అన్నాడు.. సరైన ఫిట్‌నెస్ లేకపోవడం వల్లే రోహిత్‌శర్మను ఆసీస్ టూర్‌కు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు తప్ప, ఇందులో ఎలాంటి మతలబులు లేవన్నారు. ఒకవేళ జట్టులో ఎంపిక చేసినా రోహిత్ మళ్లీ గాయపడే ప్రమాదం ఉందని బీసీసీఐ వైద్య బృందం రిపోర్ట్ చేసిందని చెప్పారు.. తొడకండరాల గాయం కారణంగా టీమిండియాలో చోటు దక్కని రోహిత్ నెట్స్‌లో మాత్రం సాధన చేస్తూ కనిపించాడు.. ఇదే పలు అనుమానాలకు తావిచ్చింది.. రోహిత్‌శర్మ మెడికల్ రిపోర్ట్ చూసిన తర్వాతే సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారని రవిశాస్త్రి తెలిపాడు. ఇందులో తమ ప్రమేయమేమీ లేదని స్పష్టం చేశాడు..
