AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైద్యుల భద్రతపై రేపు సుప్రీం విచారణ

దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల భద్రత కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు మంగళవారం విచారించనుంది. ఈ అంశంపై న్యాయవాది అలోక్​ శ్రీవాత్సవ అత్యవసర విచారణ కోరగా జస్టిస్​ దీపక్​ గుప్తా, జస్టిస్​ సూర్యకాంత్​తో కూడిన​ ధర్మాసనం అంగీకరించింది. బెంగాల్ లో జూడాల ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం ఈ పిటిషన్ దాఖలైంది. దేశంలోని అన్ని సర్కారీ ఆస్పత్రుల్లో వైద్యుల రక్షణ కోసం భద్రతా సిబ్బందిని నియమించే విధంగా హోంశాఖ, ఆరోగ్యశాఖ, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు […]

వైద్యుల భద్రతపై రేపు సుప్రీం విచారణ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 17, 2019 | 3:16 PM

Share

దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల భద్రత కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు మంగళవారం విచారించనుంది. ఈ అంశంపై న్యాయవాది అలోక్​ శ్రీవాత్సవ అత్యవసర విచారణ కోరగా జస్టిస్​ దీపక్​ గుప్తా, జస్టిస్​ సూర్యకాంత్​తో కూడిన​ ధర్మాసనం అంగీకరించింది. బెంగాల్ లో జూడాల ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం ఈ పిటిషన్ దాఖలైంది. దేశంలోని అన్ని సర్కారీ ఆస్పత్రుల్లో వైద్యుల రక్షణ కోసం భద్రతా సిబ్బందిని నియమించే విధంగా హోంశాఖ, ఆరోగ్యశాఖ, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేయాలని పిటిషనర్​ కోరారు. కాగా, జూడాల సమ్మెకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.