వొడాఫోన్, ఎయిర్‌టెల్ సర్వీస్ ప్రొవైడర్లకు సుప్రీంకోర్టు నోటీసులు

శారదా కుంభకోణం కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి.. వొడాఫోన్, ఎయిర్ టెల్ సర్వీస్ ప్రొవైడర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సర్వీస్ ప్రొవైడర్ల కేసు విచారణలో తమకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు విన్నవించింది. శారదా కుంభకోణం కేసుకు సంబంధించిన కాల్ రికార్డులు ఇవ్వలేదని సుప్రీంకోర్టుకు తెలిపింది సీబీఐ. దీంతో.. సుప్రీంకోర్టు ఎయిర్‌టెల్, వొడాఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. కాగా.. సీబీఐకి అన్ని వివరాలు ఇచ్చామని కోర్టుకు తెలిపారు వొడాఫోన్ తరపు […]

వొడాఫోన్, ఎయిర్‌టెల్ సర్వీస్ ప్రొవైడర్లకు సుప్రీంకోర్టు నోటీసులు
Follow us

| Edited By: Vijay K

Updated on: Mar 29, 2019 | 7:28 PM

శారదా కుంభకోణం కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి.. వొడాఫోన్, ఎయిర్ టెల్ సర్వీస్ ప్రొవైడర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సర్వీస్ ప్రొవైడర్ల కేసు విచారణలో తమకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు విన్నవించింది. శారదా కుంభకోణం కేసుకు సంబంధించిన కాల్ రికార్డులు ఇవ్వలేదని సుప్రీంకోర్టుకు తెలిపింది సీబీఐ. దీంతో.. సుప్రీంకోర్టు ఎయిర్‌టెల్, వొడాఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. కాగా.. సీబీఐకి అన్ని వివరాలు ఇచ్చామని కోర్టుకు తెలిపారు వొడాఫోన్ తరపు న్యాయవాది. అయితే.. సర్వీస్ ప్రొవైడర్లు సుప్రీం నోటీసులకు ఏప్రిల్ 8లోపు సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది సుప్రీం.