ఎస్‌బీఐ సూప‌ర్ గుడ్ న్యూస్…వారికి మాత్ర‌మే…

దేశీ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ కొత్త ఈకామర్స్ పోర్టల్‌ను తీసుకువచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తోంది. సూక్ష్మ స్థూల మధ్యతరహా పరిశ్రమలు ఉత్ప‌త్తి చేసే వ‌స్తువుల అమ్మ‌కానికి ఈ పోర్టల్‌ను అందుబాటులో ఉంచుతామని ఎస్‌బీఐ చైర్మన్ రజ్‌నీష్ కుమార్ వెల్ల‌డించారు

ఎస్‌బీఐ సూప‌ర్ గుడ్ న్యూస్...వారికి మాత్ర‌మే...
Follow us

|

Updated on: Jul 01, 2020 | 7:04 PM

దేశీ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ కొత్త ఈకామర్స్ పోర్టల్‌ను తీసుకువచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తోంది. సూక్ష్మ స్థూల మధ్యతరహా పరిశ్రమలు ఉత్ప‌త్తి చేసే వ‌స్తువుల అమ్మ‌కానికి ఈ పోర్టల్‌ను అందుబాటులో ఉంచుతామని ఎస్‌బీఐ చైర్మన్ రజ్‌నీష్ కుమార్ వెల్ల‌డించారు. దీని పేరు భారత్ క్రాఫ్ట్ గా వివ‌రించారు. బ్యాంకు, గ‌వ‌ర్న‌మెంట్ రెండూ కలిసి ఈ పోర్టల్‌ను నిర్వహించ‌నున్న‌ట్లు స‌మాచారం.

‘ఇప్పటికే వ‌ర్క్ ప్రారంభ‌మైంది. పోర్టల్‌కు సంబంధించి విధి విధానాలు ఫైన‌ల్ అయ్యాయి. ఫ్లాట్‌ఫామ్ రూపకల్పన వ‌ర్క్స్ త్వరలోనే స్టార్ట‌వుతాయి’ అని రజ్‌నీష్ కుమార్ పేర్కొన్నారు. సీఐఐ నిర్వహించిన ఒక వెబినార్‌లో ఆయన ఈ విషయాన్ని తెలియ‌జేశారు. అయితే కొత్త ఈకామర్స్ పోర్టల్ ఎప్ప‌ట్నుంచి అందుబాటులోకి వ‌స్తుంది అన్న వివ‌రాలు తెలియ‌రాలేదు. ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తే ఎంఎస్ఎంఈలు.. వారి ఉత్ప‌త్తుల‌ను వారే సొంతంగా పోర్టల్‌లో అమ్ముకోడానికి వీలు క‌లుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ-మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. ఇకపోతే ఎస్‌బీఐ.. సూక్ష్మ స్థూల మధ్యతరహా పరిశ్రమలను ప్రొత్స‌హించ‌డానికి చాలా చర్యలు తీసుకుంటూ వస్తోంది. వీటిల్లో సులభంగా లోన్స్ అందిచడం కూడా ఒకటి. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ కింద ప‌రిశ్ర‌మ‌ల‌కు భారీగా రుణాలిచ్చింది ఎస్‌బీఐ.