ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రుణాలపై తగ్గనున్న వడ్డీరేట్లు..!
కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వరస దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. అయితే.. ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ కీలక

Special deposit scheme: కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వరస దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. అయితే.. ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ కీలక వడ్డీ రేట్లను సవరించింది. నిధులపై వ్యయానికి అనుగుణంగా రుణాలపై వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు మేర కోత పెట్టింది. ప్రస్తుతం 7.40 శాతంగా ఉన్న రేటును 7.25 శాతానికి తగ్గించింది. దీంతో ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానం కలిగిన రుణాలను తీసుకున్నవారికి లబ్ధి చేకూరనుంది.
ఎలా అంటే.. 30 ఏళ్ల వ్యవధిపై రూ.25 లక్షలు గృహ రుణం తీసుకున్న వారికి ఈఎంఐ సుమారు రూ.255 తగ్గనుంది. మే 10 నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. అలాగే, మూడేళ్ల కాలవ్యవధి కలిగిన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. మే 12 నుంచి ఈ వడ్డీరేట్లు వర్తిస్తాయి.
కాగా.. సీనియర్ సిటిజన్ల కోసం ఎక్కువ వడ్డీని అందించే ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ఎస్‌బీఐ తీసుకొచ్చింది. రోజురోజుకూ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గుతున్న నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు ఊరట కల్పించేందుకు ‘ఎస్‌బీఐ వియ్ కేర్ డిపాజిట్’ పేరిట రిటైల్ టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఐదేళ్లు, ఆపైన కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై 30 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ చెల్లించనున్నారు. సెప్టెంబర్ 30 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.