యూరేనియం ఫైట్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే‌కు యాంకర్ అనసూయ క్షమాపణ..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే ఈ చర్య వల్ల భవిష్యత్తు తరాలకు తీరని నష్టం వాటిల్లుతుందని నెటిజన్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా #SaveNallamala అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తూ.. క్యాంపెయిన్ మొదలుపెట్టారు. తాజాగా ఈ క్యాంపెయిన్‌కు జబర్దస్త్ యాంకర్, నటి అనసూయ కూడా […]

యూరేనియం ఫైట్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే‌కు యాంకర్ అనసూయ క్షమాపణ..
Follow us

|

Updated on: Sep 13, 2019 | 8:18 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే ఈ చర్య వల్ల భవిష్యత్తు తరాలకు తీరని నష్టం వాటిల్లుతుందని నెటిజన్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా #SaveNallamala అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తూ.. క్యాంపెయిన్ మొదలుపెట్టారు. తాజాగా ఈ క్యాంపెయిన్‌కు జబర్దస్త్ యాంకర్, నటి అనసూయ కూడా మద్దతుగా నిలిచారు. అయితే ట్విట్టర్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అనసూయ.. పొరపాటున మాజీ అటవీశాఖ మంత్రి జోగు రామన్నను ట్యాగ్ చేశారు. ఆ తర్వాత తన తప్పును సరిదిద్దుకుని జోగు రామన్నకు క్షమాపణలు చెప్పడం జరిగింది.

‘కరెంట్ ఎఫైర్స్‌‌పై అవగాహన రాహిత్యంతో ఇలా ఒకరిని క్షమాపణ అడిగే రోజు వస్తుందనుకోలేదు. జోగు రామన్న గారికి క్షమాపణలు చెబుతున్నాను. ఈ మెసేజ్‌ ప్రస్తుత అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఫార్వర్డ్ చేస్తున్నాను.’ అనసూయ తన ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నారు.

ఇక నల్లమల అడవుల గురించి ప్రస్తావిస్తూ.. ‘ఇదేగా మన ఫ్యూచర్..? యురేనియం తవ్వకాలకు ఎలా అనుమతినిస్తున్నారు సర్..? ఆలోచించడానికే భయమేయలేదా..? అంటూ ప్రశ్నించారు. కాగా ఇదే విషయంపై హీరో విజయ్ దేవరకొండ కూడా కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో స్పందించిన సంగతి తెలిసిందే. ‘యురేనియం కొనవచ్చు గానీ అడవిని కొనగలమా..? అని విజయ్ అడిగిన ప్రశ్న నెట్టింట్లో వైరల్‌గా మారింది.