వార్నీ.. దున్నపోతుకు డీఎన్ఏ టెస్ట్‌ అట..! ఎందుకో తెలుసా..?

అప్పుడప్పుడు ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన పిల్లలు తారుమారవ్వడం చూస్తూ ఉంటాం. అప్పుడు ఆ పాప తల్లిదండ్రులు ఎవరన్న దానిపై వివాదం తలెత్తడం కామన్. అప్పుడు ఆ పాప నిజమైన తల్లిదండ్రులు ఎవరన్న దానిపై తేల్చడానికి.. ఆ పాపకు, తల్లిదండ్రులకు డీఎన్ఏ టెస్ట్ చేసి.. అసలు తల్లిదండ్రులు ఎవరన్నది తేల్చుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇదే గొడవ జంతువుల విషయంలో చోటుచేసుకుంటే.. అదేంటి జంతువుల విషయంలో ఎందుకు వస్తుంది అనుకుంటున్నారా.. కర్ణాటకలో జరిగిన ఓ వివాదం […]

వార్నీ.. దున్నపోతుకు డీఎన్ఏ టెస్ట్‌ అట..! ఎందుకో తెలుసా..?
Follow us

| Edited By:

Updated on: Oct 22, 2019 | 12:29 AM

అప్పుడప్పుడు ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన పిల్లలు తారుమారవ్వడం చూస్తూ ఉంటాం. అప్పుడు ఆ పాప తల్లిదండ్రులు ఎవరన్న దానిపై వివాదం తలెత్తడం కామన్. అప్పుడు ఆ పాప నిజమైన తల్లిదండ్రులు ఎవరన్న దానిపై తేల్చడానికి.. ఆ పాపకు, తల్లిదండ్రులకు డీఎన్ఏ టెస్ట్ చేసి.. అసలు తల్లిదండ్రులు ఎవరన్నది తేల్చుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇదే గొడవ జంతువుల విషయంలో చోటుచేసుకుంటే.. అదేంటి జంతువుల విషయంలో ఎందుకు వస్తుంది అనుకుంటున్నారా.. కర్ణాటకలో జరిగిన ఓ వివాదం చూస్తే షాక్ తింటారు.

వివరాల్లోకి వెళితే.. శివమొగ్గ జిల్లాలోని హారనహళ్లి – హొన్నాళి బేలిమల్లూరు గ్రామాల మధ్య వివాదం చెలరేగింది. అది అలాంటి ఇలాంటి వివాదం కాదు.. ఎవరూ ఎప్పుడు ఊహించని వివాదం. అది కూడా ఓ దున్నపోతు విషయంలో.. ఆ వివాదం గ్రామస్థాయి నుంచి చివరకు పోలీస్‌ స్టేషన్‌ మెట్లు దాకా వచ్చింది. హారనహళ్లి – హొన్నాళి బేలిమల్లూరు గ్రామాల ప్రజలు గ్రామదేవతకు దున్నపోతును బలిఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. గ్రామదేవతల కోసం ఓ దున్నపోతును ఊరిలో వదులుతారు. ఆ తర్వాత ఆ దున్నపోతును కొద్దిరోజులకు బలి ఇస్తారు. అయితే ఈ రెండు గ్రామాల్లో కూడా ఇదే సాంప్రదాయం ఉంది. అంతేకాదు రెండు గ్రామాలు కూడా దున్నపోతులను ఊరిలో వదిలాయి. పొలిమేరలల్లోనూ, పొలాల్లోనూ ఓ దున్నపోతు తిరుగుతూ బాగా పెరిగింది. అయితే అమ్మవారికి దానిని సమర్పించే సమయం వచ్చేసరికి ఈ దున్నపోతు మాదంటే మాదంటూ ఇరుగ్రామాల ప్రజలు గొడవకు దిగారు. అయితే వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు మఠాధిపతులు, గ్రామ పెద్దలు రంగంలోకి దిగారు.

అయితే వివాదం పరిష్కారం కోసం ఓ గ్రామానికి చెందిన వారు దున్నపోతుకు డీఎన్ఏ టెస్టులు చేయించాలని.. ఎందుకంటే దీని తల్లి తమ వద్దే ఉందంటూ డిమాండ్‌కు దిగారు. అయితే మరోవైపు ఇంకో ఊరు వారు మాత్రం వారి డిమాండ్‌ను ఖండించారు. జాతరకు వదిలిన దున్నపోతు నుండి రక్తం తీయరాదని, అలా తీస్తే దేవిపూజకు ఆటంకాలు కలుగుతాయంటూ వాదించారు. దీంతో డీఎన్‌ఏ టెస్ట్‌కు బదులుగా ప్రమాణం చేసేందుకు హొన్నాళికి చెందిన ఓ స్వామీజీ రంగం సిద్ధంచేసారు. అయితే ప్రమాణం చేసిన అనంతరం ఇచ్చే తీర్పుకు రెండు గ్రామాలు కట్టుబడి ఉండాలని స్వామీజి కోరారు. ఈ ప్రాంతంలో సత్యానికి ప్రతీకగా నిలిచిన హిరేకల్మఠంలోని ఓ కట్టముందు ప్రమాణం చేసేందుకు రెడీ అయ్యారు. బేలిమల్లూరు గ్రామస్తుల తరపున ఒకరు..హారనహళ్లి గ్రామప్రజల తరుపున మరొకరు ఈ దున్నపోతు మాదంటే మాదని ప్రమాణం చేశారు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దున్నపోతు ఏ గ్రామానికి చెందిందన్న విషయం తేలలేదు. ఇరు గ్రామాల తరుపున ప్రజలు ఒకే రకమైన ప్రమాణం చేయడంతో పోలీసులు, మఠాధిపతులు కూడా ఏం చేయాలో తొచక.. తీర్పును మరో రోజుకు వాయిదావేసి పంపించారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?