66 ఫోర్లు, 43 సిక్సర్లతో 815 పరుగులు.. బ్యాట్‌తో పూనకాలు తెప్పించేశారుగా.. ఆ ప్లేయర్లు ఎవరంటే.?

వడోదరలోని జీడీఎఫ్‌సీ మైదానంలో యూపీ, విదర్భ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుతాలు జరిగాయి. ఈ మ్యాచ్‌లో విదర్భ 406 పరుగులు చేసినప్పటికీ ఆ జట్టు ఓటమి పాలైంది. ఇంత భారీ స్కోరును యూపీ కేవలం 41.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. అలాగే ఈ మ్యాచ్‌ బౌలర్లకు నైట్‌మేర్ అని చెప్పొచ్చు. మరి ఆ మ్యాచ్ సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

66 ఫోర్లు, 43 సిక్సర్లతో 815 పరుగులు.. బ్యాట్‌తో పూనకాలు తెప్పించేశారుగా.. ఆ ప్లేయర్లు ఎవరంటే.?
Cricket
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 26, 2024 | 6:50 PM

వడోదర మైదానంలో జరిగిన అండర్-23 స్టేట్ ఏ ట్రోఫీ మ్యాచ్‌లో రికార్డుల వర్షం కురిసింది. ఈ మ్యాచ్‌లో విదర్భ 406 పరుగులు చేయగా.. యూపీ ఈ స్కోర్‌ను రెండు వికెట్లు కోల్పోయి.. కేవలం 41.2 ఓవర్లలో చేధించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 43 సిక్సర్లు, 66 ఫోర్లు నమోదయ్యాయి. అలాగే ఇరు జట్లు కలిసి మొత్తంగా 815 పరుగులు చేశాయి. అటు ఈ మ్యాచ్‌లో 3 అర్ధ సెంచరీలు, 2 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ నమోదైంది. విదర్భ కెప్టెన్ ఫైజ్, డానిష్ అద్భుత సెంచరీలు చేయగా.. యూపీ తరపున సమీర్ రిజ్వీ డబుల్ సెంచరీ సాధించాడు. సమీర్ రిజ్వీ 105 బంతుల్లో అజేయంగా 202 పరుగులు చేసి ఈ టోర్నీలో రెండో డబుల్ సెంచరీని నమోదు చేయడం విశేషం. అలాగే యూపీ వికెట్ కీపర్ షోయబ్ సిద్ధిఖీ కూడా 73 బంతుల్లో అజేయంగా 96 పరుగులు చేశాడు.

18 సిక్సర్లతో రిజ్వీ ఊచకోత..

సమీర్ రిజ్వీ తన డబుల్ సెంచరీతో విదర్భ బౌలర్లను ఊచకోత కోశాడు. యూపీ కెప్టెన్ రిజ్వీ తన ఇన్నింగ్స్‌లో 18 సిక్సర్లు బాదాడు. అంతేకాదు అతడి బ్యాట్ నుంచి 10 బౌండరీలు కూడా వచ్చాయి. డబుల్ సెంచరీలో రిజ్వీ స్ట్రైక్ రేట్ 192.38 కాగా.. వన్డే మ్యాచ్‌లో ఇంతటి స్ట్రైక్ రేట్ రిజ్వీకి మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

సమీర్ రిజ్వీ విధ్వంసం..

ఈ టోర్నీలో సమీర్ రిజ్వీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 6 మ్యాచ్‌లు ఆడిన సమీర్ రిజ్వీ 242 సగటుగా ఏకంగా 728 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ టోర్నీలో సమీర్ రిజ్వీ 62 సిక్సర్లు, 52 ఫోర్లు కొట్టాడు. సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ వేలానికి ముందుగా వదులుకుంది. అలాగే మెగా వేలంలో అతడ్ని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

ఇది చదవండి: బాబు బంగారం.! 20 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేసాడు.. కట్ చేస్తే.. 9 నెంబర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..