జమ్మూ కాశ్మీర్‌లో గుప్ కార్ అలయెన్స్ కు దెబ్బ, కూటమి నుంచి సజాద్‌లోనె నేతృత్వంలోని పార్టీ ఔట్, అభ్యర్థులే సమస్య

జమ్మూ కాశ్మీర్ లో ఏడు పార్టీల పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్ కార్ అలయెన్స్ డిక్లరేషన్  నుంచి తాము వైదొలగుతున్నట్టు పీపుల్స్ కాన్ఫరెన్స్..

  • Umakanth Rao
  • Publish Date - 7:19 pm, Tue, 19 January 21
జమ్మూ కాశ్మీర్‌లో గుప్ కార్ అలయెన్స్ కు దెబ్బ, కూటమి నుంచి సజాద్‌లోనె నేతృత్వంలోని పార్టీ ఔట్, అభ్యర్థులే సమస్య

జమ్మూ కాశ్మీర్ లో ఏడు పార్టీల పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్ కార్ అలయెన్స్ డిక్లరేషన్  నుంచి తాము వైదొలగుతున్నట్టు పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజాద్ లోనె ప్రకటించారు. ఇటీవల జరిగిన డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో ఈ కూటమిలోని కొన్ని పార్టీలు డమ్మీ అభ్యర్థులను నిలబెట్టాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఓ లేఖను గుప్ కార్ డిక్లరేషన్ హెడ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడికి లేఖ రాశారు. కూటమి అధికారిక అభ్యర్థులను కాదని వీరిని నిలబెట్టిన కారణంగా కూటమి ఎక్కువ సీట్లను గెలుచుకోలేకపోయిందని సజాద్ అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో ఈ కూటమి  ఎక్కువ స్థానాలను గెలుచుకున్నప్పటికీ నేటికీ ఫలితాలపై నేతలు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. మరికొన్ని పార్టీలు కూడా సజాద్ బాటనే పట్టే సూచనలు కానవస్తున్నాయి.