టాలీవుడ్‏లో దూసుకుపోతున్న ‘క్రాక్’ విలన్.. మోస్ట్ వాంటెడ్ యాక్టర్‏గా మారిన సముద్రఖని..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోతోపాటు విలన్స్ కూడా క్రేజ్ పెరిగిపోతుంది. హీరో ఎంత బలంగా ఉన్నా... అతని ప్రత్యర్థి కూడా

  • Rajitha Chanti
  • Publish Date - 7:15 pm, Tue, 19 January 21
టాలీవుడ్‏లో దూసుకుపోతున్న 'క్రాక్' విలన్.. మోస్ట్ వాంటెడ్ యాక్టర్‏గా మారిన సముద్రఖని..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోతోపాటు విలన్స్ కూడా క్రేజ్ పెరిగిపోతుంది. హీరో ఎంత బలంగా ఉన్నా… అతని ప్రత్యర్థి కూడా బలమైన నాయకుడే అయి ఉండాలి. ఇక గతంలో విలన్ పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్, రావు రమేష్ వంటి నటులు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవల సెకండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టిన జగపతి బాబు కూడా విలన్ పాత్రల్లో తన హావా చూపించాడు.

తాజాగా తెలుగులో కొత్త విలన్ తన నటనతో దూసుకుపోతున్నాడు. 2020లో సంక్రాంతి కానుకగా ‘అల వైకుంఠపురం’ సినిమాతో ఫాంలోకి వచ్చాడు సముద్రఖని. తాజాగా మాస్ మాహారాజా నటించిన ‘క్రాక్’ సినిమాలో విలన్‏గా మరోసారి తానెంటో నిరుపించుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్‏గా మారిపోయాడు. అటు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Also Read:

ఆర్జీవి వెబ్ సిరీస్ పోస్టర్ రిలీజ్.. ‘ఇది మహాభారతం కాదు.. కానీ అలాంటి పాత్రలే’ అంటూ..

heroine Rakulpreet singh: ‘నీ పని అయిపోయింది.. ఇక నీకు అవకాశాలు రావన్నారు’.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన రకుల్..