ఆర్జీవి వెబ్ సిరీస్ పోస్టర్ రిలీజ్.. ‘ఇది మహాభారతం కాదు.. కానీ అలాంటి పాత్రలే’ అంటూ..

లాక్‏డౌన్ సమయంలోనూ వరుస సినిమాలు తీస్తూ బిజీగా మారాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మొన్నటి వరకు వివాదస్పద సినిమాలు తెరకెక్కిస్తున్న ఆర్జీవీ..

ఆర్జీవి వెబ్ సిరీస్ పోస్టర్ రిలీజ్.. 'ఇది మహాభారతం కాదు.. కానీ అలాంటి పాత్రలే' అంటూ..
Follow us

| Edited By: Sanjay Kasula

Updated on: Jan 18, 2021 | 10:25 PM

Ram Gopal Varma: లాక్‏డౌన్ సమయంలోనూ వరుస సినిమాలు తీస్తూ బిజీగా మారాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మొన్నటి వరకు వివాదస్పద సినిమాలు తెరకెక్కిస్తున్న ఆర్జీవీ.. తాజాగా తన స్టైల్ మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇది “మాహాభారతం కాదు” అనే వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లుగా పోస్టర్ విడుదల చేశాడు ఆర్జీవీ. ఇక ఆ పోస్టర్‏తోనే మళ్లీ ఆసక్తిని కలిగించాడనే చెప్పాలి.

“ఇది మహాభారతం కాదు అనే టైటిల్ పోస్టర్ పై గిది 2019ల తెలంగాణలో ధర్మన్న, దుర్యన్న ఫ్యామిలీల నడిమిట్ల లొల్లి లేపిన ద్రుపది కొట్లాట పెట్టిన గోపాల్ యాదవ్ గానీ కథ ఆధారంగా తీస్తున్న వెబ్ సిరీస్” అని వర్మ్ ప్రకటించడం గమనార్హం. అంతే కాకుండా ఆడియో పోస్టర్లో వర్మ మాట్లాడుతూ.. “మహాభారతంలో కనిపించే పాత్రలు ఎక్కడో ఒక చోట తారసపడుతుంటాయని తెలంగాణంలోని ఓ పట్టణంలోనూ అలాంటి వ్యక్తులు ఉన్నారని.. దీని ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తీస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా టైటిల్‏తోనే పిచ్చ క్లారిటీ ఇస్తున్నానని, చెవులు తెరుచుకొని వినాలని ఆడియోలో ఆర్జీవి చెప్పడం మరింత చర్చనీయాంశంగా మారింది. సిరాశ్రీ రచనపై ఆనంద్ చంద్ర దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుండగా.. రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఆడియో పోస్టర్..

Also Read:

2021 Summer Movies: వేసవిలో సందడి చేయనున్న సినిమాలు ఇవే.. సన్నాహాలు చేస్తున్న చిత్రయూనిట్స్..

Hero Balakrishna: బాలయ్య ప్రత్యర్థిగా మారనున్న బాలీవుడ్ సీనియర్ హీరో ? భారీ ప్లాన్ వేసిన మాస్ డైరెక్టర్..