కొత్త ప్రాజెక్ట్‏కు ఓకే చెప్పిన నందమూరీ హీరో.. తొలిసారి ట్రిపుల్ రోల్‏లో నటించనున్న కళ్యాణ్ రామ్ ?

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఎంత మంచివాడవురా. ఈ సినిమాకు వేగేశ్న సతీష్

కొత్త ప్రాజెక్ట్‏కు ఓకే చెప్పిన నందమూరీ హీరో.. తొలిసారి ట్రిపుల్ రోల్‏లో నటించనున్న కళ్యాణ్ రామ్ ?
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 19, 2021 | 7:42 PM

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఎంత మంచివాడవురా. ఈ సినిమాకు వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించగా.. గతేడాది విడుదలైన ఈ మూవీ ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది. ఇక అప్పటి నుంచి కళ్యాణ్ రామ్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా మరో విభిన్న సినిమాకు ఓకే చెప్పినట్లుగా సమాచారం.

ఈ మూవీతో రవీందర్ దర్శకుడిగా పరిచయం కానున్నారట. రవీందర్ చెప్పిన కథ విభిన్నంగా ఉండడంతో కళ్యాణ్ రామ్ వెంటనే ఓకే చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్‏లో నటించనున్నట్లుగా ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ట్రిపుల్ రోల్‏లో చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించగా.. తొలిసారి కళ్యాణ్ రామ్ కూడా ట్రిపుల్ రోల్‏లో నటించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యయని.. వచ్చే నెల నుంచి ఈ మూవీ సెట్ పైకి రానున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:

Sridevi Younger Daughter Debut: వెండి తెరపై అడుగు పెట్టనున్న అతిలోక సుందరి శ్రీదేవి మరో వారసురాలు

Priyamani: లాక్‌డౌన్ సమయం దేవుడిచ్చిన వరంలా అనిపించింది.. గత సంవత్సర మధుర స్మృతులను తలుచుకుంటున్న..